Last Updated:
అసలు ఈ సినిమా జనాల్లో ముందుగా పెద్దగా అంచనాలు లేవు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు, సీతారామం.. ఇలా సెన్సిబుల్ లవ్ స్టోరీలు తీసిన హను రాఘవపూడి ప్రభాస్‌ను హ్యాండిల్ చేయగలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమానే చేయడం కత్తి మీద సాము అనుకుంటున్న ఈ రోజుల్లో ప్రభాస్ మాత్రం అలవోకగా ఏడాదికి రెండు, మూడు సినిమాలు పట్టాలెక్కించేస్తున్నాడు. అలా అని డార్లింగ్ చేసే సినిమాలేం అల్లా టప్పావి కాదు. అన్ని రూ.300 కోట్లకు మించిన బడ్జెట్‌లే. అంతేకాదు ప్రతీ ఏడాది రెండు, మూడు రిలీజ్‌లు ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ లైనప్‌లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజీ.














