Rahul Gandhi funny speech in LS | నాకు, మోదీకి భార్యల గోల లేదు! రాహుల్ జోకులు.. సభలో నవ్వులు | ACTPnews

Rahul Gandhi funny speech in LS | నాకు, మోదీకి భార్యల గోల లేదు! రాహుల్ జోకులు.. సభలో నవ్వులు



లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో చమత్కరించారు. మహిళల సమస్యల గురించి మాట్లాడుతూ.. “ప్రధాని మోదీకి కానీ, నాకు కానీ భార్యల గోల లేదు (Wife issues). కానీ మాకు నేర్చుకోవడానికి మా తల్లులు, సోదరీమణులు ఉన్నారు” అని అనడంతో సభ ఒక్కసారిగా నవ్వులతో దద్దరిల్లింది. రాజకీయ విమర్శల మధ్య ఇద్దరు నేతల వ్యక్తిగత స్థితిని ఉద్దేశించి ఆయన చేసిన ఈ జోక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, వెంటనే తేరుకున్న రాహుల్.. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని, జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ఇప్పుడే ఈ చట్టాన్ని అమలు చేయాలని సీరియస్ డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports