అమృత్ స్టేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూస్తే స్టేషన్ ప్రవేశ ద్వారంను కొత్తగా నిర్మించి, స్టేషన్ ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న 2 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు అదనంగా 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 2 లిఫ్ట్‌లతో పాటు మరో 2 కొత్త ప్రయాణికుల లిఫ్ట్‌లు, 2 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ఫారంలను మెరుగుపరిచి, అదనపు షెడ్లు, కొత్త శౌచాలయం, వెయిటింగ్ హాల్, ల్యాండ్‌స్కేపింగ్, ఫసాడ్ లైటింగ్, ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యే సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. (image: South Central Railways)














