Idupu Kayitham: ట్రెండింగ్‌లో ప్రియదర్శి ఇడుపు కాయితం.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా రాబోతున్న కొత్త సినిమా ఇడుపు కాయితం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది.

News18
News18

యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

“ఇడుపు కాయితం” సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో మరే చిత్రానికీ లేనంతగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దీంతో ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా బాగా ఆకర్షిస్తోంది. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. “ఇడుపు కాయితం” త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రియదర్శి, నాగదుర్గ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఇడుపు కాయితం అనే టైటిల్ బయటకు రాగానే.. అసలు ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి? అనే చర్చ మొదలైంది. ఇది పక్కా గ్రామీణ తెలంగాణ పదం కావడంతో ఆంధ్ర ప్రాంతంలో పుట్టి పెరిగిన వారికి అర్థం కాలేదు. ఇడుపు కాయితం అంటే.. విడాకుల పత్రం అని, భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం. ఈ టైటిల్ ప్రకటన తర్వాత దీని అర్థం అంతా తెలుసుకున్నారు. ఇలా కూడా సినిమాకు బెస్ట్ ప్రమోషన్ దక్కింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports