Ram Charan: ‘పెద్ది’ హిట్ జోష్‌లో రామ్ చరణ్.. హైదరాబాద్ శివార్లలో కొత్త లగ్జరీ ఫామ్‌హౌస్ రెడీ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘పెద్ది’ సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన డ్రీమ్ ఫామ్‌హౌస్‌తో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ శివార్లలో నిర్మించిన ఈ 5 ఎకరాల లగ్జరీ ఫామ్‌హౌస్‌లో ప్రకృతి వ్యవసాయానికి కూడా ప్రత్యేక స్థానం కల్పించారు.

News18
News18

గత నెల విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించారు. దాదాపు రూ. 400 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి ఈ చిత్రం చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ భారీ విజయం అందించిన జోష్‌లో ఉన్న చరణ్, తన తదుపరి చిత్రాన్ని టాలెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే దీని షూటింగ్ ప్రారంభమై, సినిమా పూర్తి స్థాయిలో సిద్ధమై ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే అందంగా ప్లాన్ చేసుకుంటారు. అందులో భాగంగానే కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ శివార్లలోని చెవెళ్ల-మోకిల పరిసర ప్రాంతంలో కొనుగోలు చేసిన 5 ఎకరాల స్థలంలో ఇప్పుడు ఒక అద్భుతమైన ఫామ్‌హౌస్‌ను నిర్మించారు.

ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్మితమైన ఈ ఫామ్‌హౌస్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని హంగులతో సిద్ధమైన ఈ ప్యాలెస్‌లోకి త్వరలోనే చరణ్ కుటుంబం గృహప్రవేశం చేయడానికి ముహూర్తం ఖరారు చేసుకుంటున్నట్లు సమాచారం.

ఈ కొత్త ఫామ్‌హౌస్ కేవలం నివాసం కోసమే కాకుండా ఒక లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్‌ను తలపించేలా డిజైన్ చేశారు. ఇప్పటి ట్రెండ్‌కు ఆధునిక సాంకేతికతకు సరిపోయేలా అద్భుతమైన ఆర్కిటెక్చర్, రిచ్ ఇంటీరియర్ డిజైన్‌తో దీనిని తీర్చిదిద్దారు. ఫామ్‌హౌస్‌లో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్, ఆధునిక పరికరాలతో కూడిన జిమ్, ప్రైవేట్ థియేటర్, విశాలమైన లివింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు.

చుట్టూ దట్టమైన పచ్చదనం, సుందరమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ ఈ ప్రాపర్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీకెండ్స్ దంపతులు ఇక్కడే ప్రశాంతంగా గడపడానికి వీలుగా దీనిని సిద్ధం చేశారు. ఈ ఫామ్‌హౌస్ వెనుక రామ్ చరణ్ దంపతులకు ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. 5 ఎకరాల స్థలంలో కేవలం కొంత భాగాన్ని మాత్రమే నివాస కట్టడం కోసం ఉపయోగించి, మిగిలిన అధిక భాగాన్ని ప్రకృతి వ్యవసాయం కోసం కేటాయించారు.

ఇందులో సేంద్రీయ పద్ధతిలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పూల తోటలను పెంచాలని చరణ్ యోచిస్తున్నారు. తమ రోజువారీ అవసరాలకు అవసరమైన స్వచ్ఛమైన ఆహారాన్ని ఇక్కడే పండించుకోవడంతో పాటు, ప్రకృతికి దగ్గరగా సమయం గడపడమే లక్ష్యంగా ఈ ల్యాండ్ డిజైన్ చేయబడింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన గ్లోబల్ స్టార్, ఇప్పుడు ఇలా ప్రకృతి ఒడిలోకి చేరుతుండటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *