Last Updated:
రామ్ పోతినేని (Ram Pothineni), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇది రామ్ కెరీర్‌లో 22వ చిత్రంగా (RAPO 22) రూపొందనుంది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని కెరీర్‌లో 22వ చిత్రంగా (RAPO 22) తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటనకు సర్వం సిద్ధమైంది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో అటు రామ్ అభిమానుల్లో, ఇటు సినీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హీరో రామ్ పోతినేని బాడీ లాంగ్వేజ్‌కు, ఎనర్జీకి సరిపడే ఒక అద్భుతమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథను అనిల్ రావిపూడి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ హిలేరియస్ కామెడీ టైమింగ్‌తో పాటు, రామ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, అదిరిపోయే డాన్సులు, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయట. ఈ స్క్రిప్ట్ లైన్ నచ్చడంతో రామ్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రామ్ పోతినేని గత చిత్రాల కంటే భిన్నమైన సరికొత్త మేకోవర్‌తో ఈ సినిమాలో కనిపించబోతున్నారని టాక్. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనుంది. ప్రస్తుతం అటు రామ్, ఇటు అనిల్ రావిపూడి తమ తమ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, అవి పూర్తి కాగానే ఈ భారీ ప్రాజెక్టును రూపొందించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు టాక్.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













