Last Updated:
టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా రంభ ఊర్వశి మేనక థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..
ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ హీరోగా, ‘కామెడీ కింగ్’గా పేరొందిన అల్లరి నరేష్ కెరీర్ గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన.. ఆ తర్వాత కొన్ని మూస కథలతో పరాజయాలను చవిచూశారు. దానికి తోడు కామెడీ సినిమాలకు ఆదరణ తగ్గడంతో రూటు మార్చి ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి సీరియస్ యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో ప్రయోగాలు చేసినా కమర్షియల్ హిట్స్ కాలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ తన పాత ఫార్ములా నమ్ముకుని, ఫాంటసీ కామెడీ జోనర్‌లో ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా చేశారు. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 4న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.














