Ranabaali: రణబాలి ఏందయ్య సామీ ఫుల్‌ సాంగ్‌ రిలీజ్.. రియల్ జోడీ అదిరింది మావా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18

Last Updated:

రియల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త సినిమా రణబాలి. ఆరు నెలల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న బీట్‌ ‘ఏందయ్య సామీ’ క్రియేట్ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పూర్తి పాటను రణబాలి టీమ్‌ విడుదల చేసింది. ఈ సాంగ్ లోని లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్‌ 16న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. షూటింగ్ మొత్తం పూర్తవడంతో చిత్రబృందం గుమ్మడికాయ కొట్టింది. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన చిత్రబృందాన్ని ‘అలుపెరుగని సైన్యం’గా అభివర్ణిస్తూ ఓ ప్రత్యేక వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ రణబాలి సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. టి-సిరీస్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమాకు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed