Last Updated:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడి కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించనున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 16న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ‘రణబాలి’ మేకింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్ర బృందం వెల్లడిస్తోంది. ఇందులో భాగంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ.. రణబాలి పాత్రను రాయలసీమ పాలెగాళ్ల చరిత్ర, వారి వీరోచిత గాథల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించినట్లు తెలిపారు.
Who is SINGANAMALA BOBBILI RANABAALI?
A name that became a legend.
A legend that found its way into the folklore of the land.But behind the name lies a story of men that wasn’t told enough.#Ranabaali Never Forget.
Truth 3: THE MEN WE FORGOT out now ❤🔥… pic.twitter.com/U1l53QPzR0
— Mythri Movie Makers (@MythriOfficial) October 2, 2026
ముఖ్యంగా బుడ్డా వెంగళ్‌రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి జీవితాలు, వారి గురించి ప్రచారంలో ఉన్న కథలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని రాహుల్ తెలిపారు. వీరి వీరోచిత గాథలు ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పాటల రూపంలో ప్రచారంలో ఉన్నాయని చెప్పారు.
ఈ ముగ్గురు వీరుల జీవితాల్లోని కొన్ని అంశాలు, వారి పోరాటాలు, ప్రజల్లో ప్రచారంలో ఉన్న కథనాలను పరిశీలించిన తర్వాతే ‘రణబాలి’ పాత్రను తీర్చిదిద్దినట్లు దర్శకుడు వెల్లడించారు. అయితే ఈ సినిమా ఏ ఒక్కరి జీవితకథకు బయోపిక్ కాదని.. పలువురు చారిత్రక వీరుల నుంచి స్ఫూర్తి తీసుకుని కల్పిత కథతో రణబాలి పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది.
బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ కథలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యోధుడి పోరాటాన్ని ప్రధానంగా చూపించబోతున్నారు. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు కనిపించని రీతిలో ఓ పీరియాడిక్ పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. రష్మిక మందన్న కథలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం ‘రణబాలి’ ప్రమోషన్స్‌ను చిత్ర బృందం వేగంగా నిర్వహిస్తోంది. నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ తరహా సిరీస్ ద్వారా సినిమా నేపథ్యం, మేకింగ్ విశేషాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. మరి రాయలసీమ వీరుల నుంచి స్ఫూర్తి పొందిన రణబాలి పాత్రను విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో ఆవిష్కరించారో తెలియాలంటే అక్టోబర్ 16 వరకు వేచి చూడాల్సిందే.














