UP: కొత్తగా పెళ్లి.. బాత్‌రూం వాడాలంటే రూ. 50 వేలు.. నవవధువుకు చుక్కలు చూపించిన అత్తింటివారు! | | ACTPnews

AI Generated


Last Updated:

UP: వరకట్న వేధింపుల్లో రోజుకో కొత్త దారుణం వెలుగు చూస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఉదంతం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.

AI Generated
AI Generated

కట్నంకింద అదనంగా రూ.50 వేలు తెచ్చాకే ఇంట్లోని మరుగుదొడ్డిని వాడాలంటూ అత్తింటివారు విచిత్రమైన ఆంక్షలు విధించారు. అంతేకాకుండా మరుగుదొడ్డికి తాళం వేసి కొత్త కోడలిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ వేధింపులపై బాధితురాలు నజ్నుం (20) పోలీసులను ఆశ్రయించడంతో ఈ అమానుష ఘటన బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భదోహికి చెందిన నజ్నుంకు ఇటీవల వివాహం జరిగింది. అయితే అదనపు కట్నం కింద రూ. 50 వేలు తేవాలని అత్తింటివారు ఆమెను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కట్నం డబ్బులు తెచ్చే వరకు ఇంట్లోని బాత్‌రూం ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ అత్తింటివారు మరుగుదొడ్డికి తాళం వేశారు. సెప్టెంబరు 27వ తేదీ ఉదయం సమయంలో మరుగుదొడ్డి తాళం తెరిచేందుకు నజ్నుం ప్రయత్నించగా, ఆమెపై మామతో పాటు మరుదులు, ఆడబిడ్డలు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు.

ఇంట్లో మరుగుదొడ్డి వాడేందుకు అనుమతి లేకపోవడంతో, ఆమె ప్రతిరోజూ తీవ్ర అవస్థలు పడుతూ పొరుగింటి బాత్‌రూమ్ వాడుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ అమానుష వేధింపుల గురించి తన భర్త ఇంతియాజ్‌‌కు చెప్పినప్పటికీ, కుటుంబ సభ్యులకు భయపడి ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా నిస్సహాయత వ్యక్తం చేశారు. భర్త నుంచి కూడా మద్దతు లభించకపోవడంతో విసుగుచెందిన బాధితురాలు ధైర్యం చేసి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ త్యాగి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 85, 115 (2), 351 (3) తో పాటు వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కట్నం కోసం ఓ మహిళకు మరుగుదొడ్డిని కూడా నిరాకరించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports