Last Updated:
ఏదైనా ఈవెంట్ జరిగే టప్పుడు సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా హూందాగా, స్మైల్ ఇస్తూ కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే.. కొన్ని సార్లు మాత్రం అనుకోకుండా జరిగే సంఘటనలు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయి.
ఏదైనా ఈవెంట్ జరిగే టప్పుడు సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా హూందాగా, స్మైల్ ఇస్తూ కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే.. కొన్ని సార్లు మాత్రం అనుకోకుండా జరిగే సంఘటనలు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయి. తాజాగా అలాంటి సంఘటనే రష్మిక మందన్నాకు జరిగింది. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న బాలీవుడ్ సినిమాల్లో కాక్‌టేయిల్ 2 మూవీ ఒకటి. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతిసనన్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది.
ఈ క్రేజీ కాంబినేషన్‌ను ప్రమోట్ చేయడానికి మేకర్స్ ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. అక్కడ మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సినిమా యూనిట్ వాళ్లు ఎంతో ఓపికగా, నవ్వుతూ సమాధానాలు చెప్పారు. ఇక జనరల్‌గా సినిమా ప్రమోషన్లలో హీరో హీరోయిన్లు క్లోజ్‌గా మూవ్ అవ్వడం, ఒకరిపై ఒకరు చేతులు వేసి కెమెరాలకు ఫోజులు ఇవ్వడం సర్వసాధారణం. కానీ ఆ కంఫర్ట్ అనేది ఇద్దరికీ సమానంగా ఉన్నప్పుడే అది స్క్రీన్ పైన అందంగా కనిపిస్తుంది.
అయితే ఇక్కడ ఫోటోలు దిగే టైమ్‌లో షాహిద్ కపూర్ చాలా క్యాజువల్‌గా రష్మిక భుజంపై చేయి వేశాదు. కానీ, ఆ ఊహించని స్పర్శ రష్మికకు ఏమాత్రం నచ్చలేదని ఆమె బాడీ లాంగ్వేజ్ స్పష్టంగా చెప్పకనే చెప్పింది. షాహిద్ చేయి పడగానే రష్మిక ముఖంలో ఒక రకమైన అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ వ్యక్తమైంది. ఆ స్పర్శ ఆమెకు అసౌకర్యాన్ని కలిగించినట్లు క్లియర్‌గా అర్థమవువుతంది. అయితే ఆమె ఎక్కడా తన అసహనాన్ని గట్టిగా ప్రదర్శించకుండా, చాలా సైలెంట్‌గా, అంతే స్మార్ట్‌గా పక్కకు జరిగి నిల్చుంది. పైకి మాత్రం తన ట్రేడ్ మార్క్ నవ్వును కంటిన్యూ చేస్తూ మేనేజ్ చేసింది.
ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక చిన్న క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ రచ్చ చేస్తుంది. నెటిజన్లు ఈ వీడియోను స్లో మోషన్‌లో పెట్టి మరీ లూప్‌లో చూస్తూ చర్చలు జరుపుతున్నారు. ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్స్‌లలో దీనిపై పెద్ద ఎత్తున డిబేట్లు నడుస్తున్నాయి. ఇండస్ట్రీలో హీరోయిన్‌లు సినిమాల ప్రమోషన్ల టైమ్‌లో ఇలాంటి అనుభవాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలామంది హీరోయిన్ల విషయంలో ఇలాంటి వీడియోలు బయటకు వచ్చి నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి.
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తిరుుగులేని క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్న.. ఇప్పుడు హిందీలో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ‘కాక్‌టెయిల్-2’ లాంటి క్రేజీ సినిమాలో చాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విశేషాలు, టీజర్ అప్‌డేట్స్ కంటే కూడా ఇప్పుడు ఈ ప్రమోషనల్ కాంట్రవర్సీనే ఎక్కువ హైలైట్ అవుతుండటం గమనార్హం.
ఈ చర్చలు ఎటు దారితీసినా, స్టార్స్ కెమెరాల ముందు ఉండేటప్పుడు ప్రతి సెకను ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఇన్సిడెంట్ హెచ్చరిస్తోంది. ఆడియన్స్ ఇప్పుడు కేవలం నటనను మాత్రమే కాకుండా, వారి వ్యక్తిగత ప్రవర్తనను కూడా చాలా నిశితంగా గమనిస్తుంటారు. ఈ వైరల్ వీడియోపై రష్మిక గానీ, షాహిద్ కపూర్ టీమ్ గానీ స్పందించి వివరణ ఇస్తే తప్ప ఈ నెటిజన్ల చర్చలకు ఫుల్ స్టాప్ పడేలా లేదు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













