Rashmika Mandanna: ‘మైసా’తో రికార్డులు తిరగరాస్తున్న రష్మిక మందన్నా.. వామ్మో ఆ వ్యూస్‌ ఏంట్రా బాబూ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కన్నడ భామ రష్మిక మందన్నా తొలిసారి పూర్తి స్థాయి యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్న చిత్రం ‘మైసా’. పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

News18
News18

న్నడ భామ రష్మిక మందన్నా తొలిసారి పూర్తి స్థాయి యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్న చిత్రం ‘మైసా’. పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా విడుదలైన టీజర్ మాత్రం రష్మికలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

‘మైసా’ టీజర్‌లో రష్మిక డీగ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చూపించిన ఇంటెన్సిటీ, బాడీ లాంగ్వేజ్, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటివరకు రష్మికను చూడని విధంగా పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఆమె పాత్రలోని రఫ్‌నెస్, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన దూకుడు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. రష్మికను ఇలాంటి పాత్రలో చూడటం ఇదే తొలిసారి కావడంతో సినీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆమె లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసిన పలువురు ప్రేక్షకులు రష్మికను సీనియర్ నటి విజయశాంతితో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక టీజర్‌ను బట్టి చూస్తే.. ‘మైసా’లో రష్మిక గోండ్ గిరిజన మహిళగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర చుట్టూనే కథ ప్రధానంగా సాగనున్నట్లు టీజర్‌లోని విజువల్స్ సూచిస్తున్నాయి. అయితే ఆమె పాత్ర స్వభావం, కథలో ఎదురయ్యే సవాళ్లు, పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. దీంతో సినిమాలో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

‘మైసా’ సినిమాతో రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో ఓ విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కూడా సమకూరుస్తున్నారు.

ఈ చిత్రంలో ‘పుష్ప 2’లో విలన్‌గా మెప్పించిన తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. రష్మికతో పాటు ఆయన పాత్ర కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌లోని విజువల్స్ సినిమాకు భారీ స్కేల్ ఉన్నట్లు చూపిస్తున్నాయి.

మొత్తంగా రష్మిక మందన్నా ఇప్పటివరకు కనిపించని కొత్త అవతార్‌లో ‘మైసా’తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా యాక్షన్ పాత్రలో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందనే దానిపై అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. మరి డెబ్యూ డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports