Last Updated:
ఉన్నపలంగా హిట్టు పడితే కానీ రవితేజ కెరీర్ ఒక గాడీలో పడదు. అప్పుడెప్పుడో ధమాకా సినిమాతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన రవన్న.. ఆ తర్వాత ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ కలిపినా వంద కోట్లు కొల్లగొట్టలేకపోయాయి. అంతలా రవితేజ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.
ఉన్నపలంగా హిట్టు పడితే కానీ రవితేజ కెరీర్ ఒక గాడీలో పడదు. అప్పుడెప్పుడో ధమాకా సినిమాతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన రవన్న.. ఆ తర్వాత ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ కలిపినా వంద కోట్లు కొల్లగొట్టలేకపోయాయి. అంతలా రవితేజ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అసలు కొన్నాళ్లుగా రవితేజ సినిమాలు రిలీజవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియాకుండానే థియేటర్‌ల నుంచి వెళ్లిపోతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి కొద్దిలో కొద్దిగా బెటర్ అనిపించింది కానీ.. కమర్షియల్‌గా ఈ సినిమా కూడా సేఫ్ కాలేకపోయింది.
ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాల్లో ‘ఇరుముడి’ ఒకటి. నిన్నుకోరి, మజిలి లాంటి కల్ట్ సినిమాలు తీసిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు గట్రా సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో రవితేజ కొంత సేపు ఓల్డ్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ లుక్ షాకింగ్‌గా ఉంటుందని.. అసలు ముసలాడిగా రవితేజ కనిపించే ఎపిసోడ్ మొత్తం ఒక రేంజ్‌లో ఉంటుందని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ ఒక ఫాదర్-డాటర్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాగా సాగుతుందట. రవితేజ కూతురుగా బేబి నకాస్ర నటిస్తుంది. అసలు వీళ్ల కాంబినేషన్‌లో వచ్చే సీన్లకు కంటతడి పెట్టడం ఖాయం అని మేకర్స్ చెబుతున్నారు. ఓ సందర్భంలో రవితేజ.. కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి సినిమా. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి అసలు ఈ సినిమా కథపై ఏ రేంజ్‌లో నమ్మకం ఉందో చెప్పాడు.
ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై చాలా సహజంగా కొత్తగా కనిపిస్తుందని టాక్. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ఆయన ఇచ్చే నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషనల్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్తుందని దర్శకుడు భావిస్తున్నారు. పాటల విషయంలో కూడా శివ నిర్వాణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














