Riyadh airport attack: రియాద్ విమానాశ్రయంపై భీకర దాడి.. రక్తసిక్తమైన టర్మినల్.. హైదరాబాద్ వాసి దుర్మరణం! | | ACTPnews

PC: X.com

[ad_1]

Last Updated:

Riyadh airport attack: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం భీకర దాడులతో ఒక్కసారిగా దద్దరిల్లింది.

PC: X.com
PC: X.com

ప్రయాణికుల రాకపోకలతో సందడిగా ఉండే టెర్మినళ్లపై జరిగిన ఈ ఆకస్మిక దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో కనీసం 11 మంది భారతీయులు ఉన్నట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

లక్ష్యంగా టెర్మినల్స్.. విమానాశ్రయాల మూసివేత

రియాద్ విమానాశ్రయ సముదాయంలోని టెర్మినల్ 3, 4లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ప్రయాణికుల టెర్మినల్‌పైకి ప్రొజెక్టైల్ దూసుకురావడంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. మరణించిన వారిలో హైదరాబాద్ వాసితో పాటు నలుగురు సౌదీ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశీయులు, అలాగే అమెరికా, పాలస్తీనా, ఈజిప్టు, జోర్డాన్, సిరియా, సుడాన్ దేశస్తులు ఉన్నారు. ఈ దాడికి తామే కారణమని హూతీ తిరుగుబాటుదారులు నేరుగా ప్రకటించనప్పటికీ, సౌదీ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుంటామని, ప్రయాణికులు ఎవరూ వాటి ద్వారా రాకపోకలు సాగించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా పలు విమానాశ్రయాలను సౌదీ ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది.

మదీనా వెళ్తుండగా విషాదం.. హైదరాబాద్ ఇంజినీర్ బలి

ఈ దాడిలో నగరంలోని మెహిదీపట్నానికి చెందిన ఐటీ ఇంజినీర్ మహ్మద్ యూసుఫ్ అలీ (45) దుర్మరణం చెందారు. పదేళ్లుగా రియాద్‌లో ఉంటున్న ఆయన, ఇటీవల సెలవులకు హైదరాబాద్ వచ్చి కుటుంబంతో కలిసి ఈ నెల 2న తిరిగి సౌదీ వెళ్లారు. శనివారం కుటుంబసభ్యులతో కలిసి మదీనా వెళ్లేందుకు రియాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుళ్ల తీవ్రతకు ఆయన రెండు కాళ్లను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి వచ్చింది. అయితే ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య, కుమార్తె సురక్షితంగా బయటపడగా, గాయపడిన ఇద్దరు కుమారులు, బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నిరసన.. భారత్ తీవ్ర ఖండన

పౌరులు, పౌర విమానాశ్రయాలపై జరిగిన ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియాకు సంఘీభావం తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా, పలు ఐరోపా, అరబ్ దేశాలు ఈ అమానుష చర్యను తప్పుబట్టాయి. ఈ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports