Last Updated:
విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. అందులో రౌడీ జనార్ధన సినిమా ఒకటి. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి ఈ సినిమా అనౌన్స్‌మెంట్ చేసిన రోజునే అంచనాలు పీక్స్‌కి వెళ్లిపోయాయి.
‘టాక్సివాలా’ తర్వాత విజయ్ దేవరకొండ ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయాడు. ‘డియర్ కామ్రేడ్’ కాస్త పర్వాలేదనిపించినా కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’ వంటి సినిమాలు విజయ్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పడేశాయి. ఈ రెండు సినిమాలు రౌడీ బాయ్‌కు మాములు దెబ్బ కొట్టలేదు. చివరికి ‘నిన్నుకోరి’, ‘మజిలి’ లాంటి కల్ట్ సినిమాలు తీసిన శివ నిర్వాణను నమ్ముకున్నా ‘ఖుషీ’ రూపంలో కంటతడే మిగిలింది. ‘గీతా గోవిందం’ లాంటి కెరీర్ టర్నింగ్ సినిమా ఇచ్చిన పరుశురామ్ పెట్లతో ‘ది ఫ్యామిలీ స్టార్’ చేసి చేతులు కాల్చుకున్నాడు.
మొత్తానికి గత ఎనిమిదేళ్లలో ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ఈ 8 ఏళ్లలో రౌడీ స్టార్‌కు ఏదైనా మంచి విషయం జరిగిందంటే అది రష్మికను పెళ్లి చేసుకోవడమే. కొన్నేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఓ వైపు తమ వైవాహిక జీవితాన్ని.. మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారు.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. అందులో రౌడీ జనార్ధన సినిమా ఒకటి. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి ఈ సినిమా అనౌన్స్‌మెంట్ చేసిన రోజునే అంచనాలు పీక్స్‌కి వెళ్లిపోయాయి. దానికి తోడు ఆ తర్వాత రిలీజైన గ్లింప్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఊపేసింది.
ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేష్, విజయ్ కలిసి నటించినప్పటికీ, వారిద్దరి మధ్య పూర్తిస్థాయిలో రొమాంటిక్ ట్రాక్ ఉండదు. కానీ ‘రౌడీ జనార్ధన’లో వీరిద్దరూ జంటగా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందని తెలుస్తుంది. అంతేకాదు డా. రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ విలువలు సినిమాను ఒక రేంజ్‌లో నిలబెడతాయని వేరే చెప్పక్కర్లేదు. క్రిస్టో జావియర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా ఈయన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమాపై హైప్ పెంచేశారు. విజయ్ బర్త్‌డే కానుకగా ఇచ్చిన ఈ పోస్టర్ ట్రీట్ రౌడీ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ ఇచ్చింది. దర్శకుడు రవికిరణ్ కోలా ఈ చిత్రాన్ని చాలా రా అండ్ రస్టిక్ స్టైల్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ మార్క్ మేనరిజమ్స్‌కు రవికిరణ్ కోలా మార్క్ మాస్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయం.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













