RS Praveen Kumar | బండి సంజయ్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ సవాల్! | ACTPnews

RS Praveen Kumar | బండి సంజయ్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ సవాల్!



కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. బండి సంజయ్కు ఆయన ఒక బహిరంగ సవాల్ విసిరారు. “నువ్వు నిజమైన హనుమాన్ భక్తుడివైతే, బాధితులను బెదిరించలేదని తడిబట్టలతో హనుమాన్ గుడిలో ప్రమాణం చేయగలవా?” అని నిలదీశారు. దేశం, ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఈ అఘాయిత్యంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. “నీ కొడుకును పోలీసులకు అప్పగించి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము విశ్రమించబోమని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *