ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డికి గడువు విధించి హెచ్చరించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేంద్రం మాటలకు తోక ముడిచాడని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ‘మన ఊరు – మన బడి’ కింద అభివృద్ధి చేసిన ఆరుట్ల పాఠశాల భవనాలకు కేవలం రంగులు వేసి, ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ అని పేరు మార్చి కొత్తగా కట్టినట్లు రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పాత ఫర్నిచర్, పాత ఉపాధ్యాయులతోనే నడిపిస్తూ పేర్లు మార్చడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, అంతగా నమ్మకముంటే తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.
Source link
Sabitha Indra Reddy Fire On CM : రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










