సాహిల్ జాదవ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేది. దానికి తోడు, అతని తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో, సోదరి చదువు , ఇంటి బాధ్యత పూర్తిగా తల్లి, కొడుకులపైనే పడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విలువిద్య వంటి ఖరీదైన క్రీడ పట్ల అతనికి అమితమైన ఆసక్తి ఉండేది. అతను అచంచలమైన సంకల్ప బలాన్ని కలిగి ఉండేడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సతారా గడ్డపై పుట్టిన ఈ యువకుడు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి, సతారాకే కాకుండా యావత్ మహారాష్ట్రతో పాటు దేశానికి కీర్తిని తెచ్చిపెట్టాడు.














