మొత్తంగా కార్పొరేట్ రంగంలో జీతాలు 8.6% నుంచి 10.2% వరకు పెరగవచ్చని అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, EV ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 9.6% నుంచి 10.2% వరకు పెంపులు ఉండొచ్చు. ఉద్యోగాల్లో చూస్తే ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు అత్యధికంగా 11.2% పెంపు అంచనా వేయబడింది. క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్లు 10.9%, ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ 10.3%, క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు 10.2% వరకు పొందే అవకాశం ఉంది. ఆటోమోటివ్, రిటైల్, ఇన్సూరెన్స్, BPO రంగాల్లో 8.9% నుంచి 9.5% వరకు పెంపులు ఉండొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)













