Samantha: ‘మా ఇంటి బంగారం’ మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సామ్ స్క్రీన్‌పై కనిపించి మూడేళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో ‘ఖుషీ’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెర వెనకాల ఉండి ‘శుభం’ సినిమాను నిర్మించింది. అందులో రెప్పపాటు కామియో రోల్ చేసింది కానీ.. సామ్ అభిమానులకు అది ఏ మాత్రం సరిపోలేదు.

News18
News18

సామ్ స్క్రీన్‌పై కనిపించి మూడేళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో ‘ఖుషీ’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెర వెనకాల ఉండి ‘శుభం’ సినిమాను నిర్మించింది. అందులో రెప్పపాటు కామియో రోల్ చేసింది కానీ.. సామ్ అభిమానులకు అది ఏ మాత్రం సరిపోలేదు. దాంతో ఆమె కొత్త సినిమా కోసం తెగ వేయిట్ చేశారు. కట్ చేస్తే, ఎవరూ ఊహించని విధంగా ‘మా ఇంటి బంగారం’ అంటూ ఓ క్రేజీ మూవీని అనౌన్స్ చేసింది.

అనౌన్స్ చేయడమే కాదు.. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. ఏంటి సామ్‌ ఈ రేంజ్‌లో మేకోవర్ అయింది అనిపించింది. సుదీర్ఘ విరామం తర్వాత సమంత తెలుగు వెండితెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా మహిళా ప్రధాన కథాంశాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్న సమంత, ఈసారి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.

ఈ సినిమాను ముందుగా మే 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. చేతిలో తుపాకీ పట్టుకుని ఇంటెన్సీవ్‌గా చూస్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు.

‘మా ఇంటి బంగారం’లో సమంత ఒక మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో కనిపించనుంది. కుటుంబ బాధ్యతలను మోస్తూనే, అనుకోని పరిస్థితుల్లో యాక్షన్ అవతారంలోకి మారే మహిళగా ఆమె పాత్ర తీర్చిదిద్దినట్టు సమాచారం. సాధారణ గృహిణి నుంచి ధైర్యవంతురాలిగా మారే ప్రయాణం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా ఉండబోతోందని టాక్. ముఖ్యంగా సమంత ఈ చిత్రంలో కొన్ని పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించడం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది.

ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. గతంలో ఆమె తెరకెక్కించిన ఓ బేబీ మంచి విజయాన్ని సాధించింది. మహిళా ప్రధాన కథలను వినోదాత్మకంగా, హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించడంలో ఆమెకు ఉన్న నైపుణ్యం ఈ చిత్రంపై కూడా అంచనాలను పెంచుతోంది. కథను ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు అందించగా, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ సమకూరుస్తున్నారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు మరింత బలం చేకూర్చనున్నాయి. ప్రహాస్ బొప్పుడి, వంసంత్ మరింగంటిలు కూడా ఈ సినిమాకు రైటర్లుగా చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports