కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం నమక్కల్లో జరిగిన నిరసనలో ఆయన స్వయంగా డీలిమిటేషన్ బిల్లు ప్రతులను తగలబెట్టారు. “ఈ మంటలు కేవలం కాగితాలను కాల్చడం లేదు.. బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తూ, ఉత్తరాదికి సీట్లు పెంచడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే శ్రేణులు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమం తరహాలోనే, ఇప్పుడు డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమిళనాడు గళమెత్తుతుందని స్టాలిన్ స్పష్టం చేశారు.
Source link
Stalin’s Fierce Protest: డీలిమిటేషన్ బిల్లును తగలబెట్టిన సీఎం స్టాలిన్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

E20 పెట్రోల్‌తో వాహనం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారు? పరిహారం పొందే అవకాశం ఉందా? కేంద్రం ఏమంటోంది? | | ACTPnews
-

RFDL Japan Tour 2026: జపాన్‌లో భారత యువ ఫుట్‌బాల్ జట్ల జోరు.. పంజాబ్, బెంగళూరు ఘన విజయాలు | క్రీడా వార్తలు | ACTPnews
-

వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ రివ్యూ.. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Shivaji: రజనీకాంత్ ‘శివాజీ’ లో అసలు హీరోయిన్ ఆమెనే.. మూవీలోకి శ్రియ ఎలా వచ్చింది.. షాకింగ్ సీక్రెట్ రివీల్ | | ACTPnews







