Last Updated:
India’s Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్ చేసిన షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
India’s Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్ చేసిన షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం స్టాండ్-అప్ కమెడియన్లు, ఇంటర్నెట్ కంటెంట్ క్రియేటర్లలో ఆనందోత్సాహాలను నింపింది. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే అంటే ఆగస్ట్ 14న జరిగిన విచారణ అనంతరం సుప్రీం కోర్టు సమయ్ రైనా, ఇతరులపై నమోదైన కేసులన్నింటిని కొట్టివేసింది. దీనికి బలమైన కారణం ఉందనే ఆలోచనతోనే సీజేఐ ఈతీర్పు వెల్లడించినట్లుగా ప్రకటించింది.














