Sanju Samson: అందుకే సంజూను పక్కన పెట్టా.. క్లారిటీ ఇచ్చిన కోచ్ గంభీర్ | క్రీడా వార్తలు | ACTPnews

గంభీర్


Last Updated:

Sanju Samson: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన తర్వాత, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

గంభీర్
గంభీర్

202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడంతో, టీ20 ప్రపంచకప్ 2026 హీరో సంజు శాంసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుండి పక్కన పెట్టడంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ వివాదాస్పద నిర్ణయంపై గంభీర్ స్పందిస్తూ.. జట్టు ఎంపిక విషయంలో తనకు, సంజు శాంసన్‌కు మధ్య పూర్తి స్పష్టత ఉందని, అయితే ఆ అంతర్గత సంభాషణను తాను బహిర్గతం చేయలేనని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన శాంసన్, ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుసగా 5, 0, 1 పరుగులకే పరిమితమై ఫామ్ కోల్పోయాడు. అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకున్నారు.

గౌతమ్ గంభీర్ మాటల్లోనే

“మొదటి విషయం ఏంటంటే, సంజు శాంసన్‌కు జట్టులో తన పాత్ర గురించి ఎలాంటి స్పష్టత కావాలో, అది నా వైపు నుండి అతనికి ఇప్పటికే అందించబడింది. ఇది పూర్తిగా ఒక ఆటగాడికి, హెడ్ కోచ్‌కు మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ, ఇది బయటకి రాదు. సంజు విషయంలో మాకు పూర్తి క్లారిటీ ఉంది. భారత్ తరఫున అతను చేసిన ప్రదర్శన అసాధారణమైనది. కానీ, కొన్నిసార్లు ఒక నిర్దిష్ట ఆటగాడి ప్రస్తుత ఫామ్‌ను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అతడు ఈ సిరీస్‌లో మళ్లీ ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి’ అని గంభీర్ స్పష్టం చేశాడు. టీమ్ కాంబినేషన్, ప్రస్తుత ఫామ్, ఫలితాల ఆధారంగానే ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని గంభీర్ సమర్థించుకున్నారు. శాంసన్‌కు టీ20 ప్లాన్స్‌లో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెబుతూనే, ప్రస్తుతానికి ఫామ్‌కు ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదని కోచ్ తేల్చి చెప్పారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports