Singer Suneetha: హీరోగా సింగర్ సునీత కొడుకు రెండో సినిమా.. కొత్త మలుపు టీజర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా చేస్తున్న రెండో సినిమా కొత్త మలుపు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయబోతున్నారు.

News18
News18

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’. జూన్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ నేపథ్యంలోని రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ సంగీతం అందించారు.

దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, “రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అన్నారు.

“ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అతనికి రెండో సినిమా. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారు. మైత్రి సంస్థ ఈ చిత్రానికి అండగా నిలవడం గర్వకారణం” అని సునీత అన్నారు.

సీనియర్ నటుడు భానుచందర్ మాట్లాడుతూ, “టీజర్ చాలా బాగుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద విజయంగా నిలబెట్టాలి” అన్నారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, “ఇది నాకు తొలి సినిమా. మా దర్శకుడికి తొలి చిత్రం. హీరోయిన్ కు తొలి సినిమా. హీరో ఆకాష్‌కు రెండో సినిమా. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి” అని తెలిపారు.

హీరో ఆకాష్ మాట్లాడుతూ, “ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ సునీతతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు” అన్నారు. హీరోయిన్ భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ, “నా కెరీర్‌లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఆకాష్‌తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి” అని చెప్పారు.

నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ, “సునీత మా కుటుంబ సభ్యురాలిలాంటివారు. ఆమె కుమారుడు హీరోగా నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. మైత్రి మూవీస్ విడుదల చేయడం ఈ సినిమాకు మరో బలం” అన్నారు. నటుడు రఘుబాబు మాట్లాడుతూ, “మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే సినిమా స్థాయి అర్థమవుతుంది. ఆకాష్‌కు మంచి భవిష్యత్ ఉంది. చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు” అన్నారు.

‘కొత్త మలుపు’ కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిందని చిత్ర‌యూనిట్ స‌భ్యులు తెలిపారు. ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *