ఆమె కెరీర్ లో మాయలోడు, హలో బ్రదర్, సూపర్ పోలీస్, మేడమ్, టాప్ హీరో, పెదరాయుడు, అమ్మోరు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం… ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అసలు ఒక టైమ్లో స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవాళ్లంటే ఏ స్థాయిలో ఆమె క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ముందుగా సౌందర్య కాల్షీట్లు బుక్ చేసుకుని.. ఆ తర్వాత హీరోవి తీసుకునే వారట. అంటే సౌందర్య క్రేజ్ అప్పట్లో ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.













