South Korean President at Rajghat: రాజ్ఘాట్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు..బాపూజీకి ఘన నివాళి! | ACTPnews

South Korean President at Rajghat: రాజ్ఘాట్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు..బాపూజీకి ఘన నివాళి!



దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్, ఆయన సతీమణి కిమ్ హీ-క్యుంగ్ సోమవారం ఢిల్లీలోని రాజ్ఘాట్ ను సందర్శించారు. భారత పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ బోధించిన అహింస, శాంతి సందేశాలను కొనియాడుతూ విజిటర్స్ బుక్లో సంతకం చేశారు. భారత్-దక్షిణ కొరియా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రితో భేటీ కానున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports