Last Updated:
ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘స్పిరిట్’ (స్పిరిట్). తాజాగా ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ తృప్తి డిమ్రి జాయిన్ అయింది. ఆ వివరాలు మీ కోసం..
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ ప్రకారం.. సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ, ‘నేషనల్ క్రష్’ తృప్తి డిమ్రి (Triptii Dimri) తాజాగా షూటింగ్లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఆమెపై కొన్ని అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రబృందం విజయవంతంగా చిత్రీకరించింది. కాగా, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కోటి ఉమెన్స్ కాలేజీ (Koti Women’s College) ప్రాంగణానికి మార్చబోతున్నారు. ఈ లొకేషన్లో ప్రభాస్, తృప్తి డిమ్రి కాంబినేషన్లో వచ్చే కొన్ని రొమాంటిక్, డ్రామా సీన్స్‌ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం.
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారిగా ఒక ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ (Cop Role) పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో ఈ క్యారెక్టరైజేషన్ మైండ్ బ్లోయింగ్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. అలాగే, ఈ చిత్రంలో ప్రభాస్‌ను ఢీకొట్టే ప్రధాన విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించనున్నట్లు సమాచారం బలంగా వినిపిస్తోంది. హీరో, విలన్ మధ్య వచ్చే మైండ్ గేమ్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్ (T-Series) మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ‘యానిమల్’ చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ రగ్గడ్ పోలీస్ లుక్, సందీప్ మేకింగ్ స్టైల్ తోడవ్వడంతో ‘స్పిరిట్’ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













