Spirit Movie: ‘స్పిరిట్’ సినిమాలో మరో స్టార్ నటుడు.. అసలేం ప్లాన్ చేస్తున్నవ్ సందీప్ మామ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సంచలనాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరగా, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలత సందీప్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను ఊపేశాడు.

News18
News18

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సంచలనాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరగా, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలత సందీప్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను ఊపేశాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీగా తెరకెక్కనుంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక క్రేజీ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ కథలో అత్యంత కీలకమైన, ఒక ప్రత్యేకమైన పాత్రను సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేశారట. ఆ క్యారెక్టర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకువెళ్తుందని సమాచారం. ఈ ప్రత్యేక పాత్ర కోసం బాలీవుడ్‌కు చెందిన ఒక సీనియర్ స్టార్ హీరోను రంగంలోకి దించేందుకు చిత్రబృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ బాలీవుడ్ హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ, ఆయన ఎంట్రీతో సినిమాకు ఉత్తరాదిలో మరింత భారీ మార్కెట్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్, ఆ బాలీవుడ్ సీనియర్ హీరో మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని ఇండస్ట్రీ టాక్.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన ‘నేషనల్ క్రష్’ త్రుప్తి దిమ్రి ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా గత చిత్రం ‘యానిమల్’‌తో ఈమెకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు నేరుగా ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేయడంతో ఈ జోడీ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మైండ్ బ్లోయింగ్ రేంజ్‌లో ఉండబోతోంది. సందీప్ రెడ్డి వంగా హీరోల క్యారెక్టరైజేషన్ ఎంత వైల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని విధంగా, ఒక పక్కా వైల్డ్ అండ్ మాస్ పోలీస్ ఆఫీసర్ అవతారంలో చూపించబోతున్నారు.

సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అద్భుతంగా రానున్నట్లు టాక్. ‘యానిమల్’ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను ఊపేసిన హర్షవర్ధన్, ఇప్పుడు ‘స్పిరిట్’ కోసం అంతకుమించిన స్కోర్ సిద్ధం చేస్తున్నారట.

టి-సిరీస్ సంస్థ, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. అసలు ‘స్పిరిట్’ మెయిన్ లైన్, దాని కథాంశం భారతీయ సినిమా రంగానికి చాలా కొత్తగా ఉంటుందని వినికిడి. రెగ్యులర్ పోలీస్ కథల తరహాలో కాకుండా, సందీప్ రెడ్డి వంగా మార్క్ వినూత్నమైన ఆలోచనలతో, వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సాగనుంది. ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే బిజినెస్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అసాధారణమైన బిజినెస్ క్రేజ్ క్రియేట్ చేస్తోంది.

మొత్తానికి ‘స్పిరిట్’ మూవీ టాలీవుడ్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు తెరలేపడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా అధికారిక ప్రకటనలు, మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed