Last Updated:
మరోసారి జబర్దస్త్ వేదికపై సందడి చేశారు సుడిగాలి సుధీర్- ఆంచారు రష్మీ. ఈ నేపథ్యంలో తన కెరీర్ తొలి రోజులు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది రష్మీ గౌతమ్.
తెలుగు బుల్లితెర చరిత్రలో ‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ వేదికపై, అత్యంత ప్రజాదరణ పొందిన టీమ్ ఏదైనా ఉందంటే అది ‘సుడిగాలి సుధీర్ టీమ్’. ఒకానొక దశలో సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ లేని జబర్దస్త్ షోను ఊహించడమే ప్రేక్షకులకు కష్టంగా ఉండేది. సుధీర్ అద్భుతమైన కామెడీ టైమింగ్, రామ్ ప్రసాద్ ఆటో పంచులు, గెటప్ శ్రీను విభిన్నమైన గెటప్పులు.. ఈ ముగ్గురి కాంబినేషన్ టెలివిజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. షో టీఆర్పీ (TRP) రేటింగ్స్ టాప్ లో ఉండటానికి వీరి స్కిట్స్ ఒక ముఖ్య కారణం.














