Suvendu Adhikari | మమత ఓటమి ఖాయం..మేమే గెలుస్తున్నాం..! | ACTPnews

Suvendu Adhikari  | మమత ఓటమి  ఖాయం..మేమే గెలుస్తున్నాం..!



పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బిజెపి అభ్యర్థి సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం (మే 4) ఉదయం ప్రారంభమైన కౌంటింగ్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై సువేందు తొలుత ఆధిక్యం కనబరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మమత ఓటమి ఖాయం.. బెంగాల్లో బిజెపి గెలుపును ఎవరూ ఆపలేరు” అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బిజెపి మరియు టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బిజెపి ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో కమలదళం సంబరాల్లో మునిగిపోయింది. గతంలో నందిగ్రామ్లో మమతను ఓడించిన సువేందు, ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తానని సవాల్ విసిరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports