Teja Sajja: ‘ది ట్రైటర్స్ తెలుగు’ లాంచ్‌కు ముందు తేజ సజ్జ సర్‌ప్రైజ్.. అమెజాన్ డెలివరీ బాయ్స్‌తో స్పెషల్ మీట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రైమ్ వీడియోలో మరో ఆసక్తికరమైన షో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా పాపులర్ అయిన ‘ది ట్రైటర్స్’ ఫ్రాంచైజీని తెలుగులోకి తీసుకొస్తూ రూపొందించిన ‘ది ట్రైటర్స్ తెలుగు’ అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

News18
News18

ప్రైమ్ వీడియోలో మరో ఆసక్తికరమైన షో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా పాపులర్ అయిన ‘ది ట్రైటర్స్’ ఫ్రాంచైజీని తెలుగులోకి తీసుకొస్తూ రూపొందించిన ‘ది ట్రైటర్స్ తెలుగు’ అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో షో ప్రమోషన్స్‌ను మేకర్స్ ఇప్పటికే జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమెజాన్ హైదరాబాద్‌లో ప్రత్యేకమైన ‘ఫ్యాన్ ఎక్స్‌పీరియన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించింది.

అక్టోబర్ 6న జరిగిన ‘ది ట్రైటర్స్ తెలుగు’ ట్రైలర్ విడుదల, పార్టిసిపెంట్స్ వివరాల వెల్లడి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెజాన్ డెలివరీ అసోసియేట్లకు వినోద ప్రపంచాన్ని మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షో హోస్ట్, ప్రముఖ తెలుగు నటుడు తేజ సజ్జ ఐదుగురు అమెజాన్ డెలివరీ అసోసియేట్లకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

డెలివరీ అసోసియేట్లను స్వయంగా కలుసుకున్న తేజ సజ్జ వారితో ముచ్చటించారు. త్వరలో ప్రారంభం కానున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’ షో గురించి వారితో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. తారను నేరుగా కలుసుకుని మాట్లాడే అవకాశం రావడంతో డెలివరీ అసోసియేట్లు ఆనందం వ్యక్తం చేశారు. తమకు అందించిన ఈ ప్రత్యేక అవకాశాన్ని జీవితంలో గుర్తుండిపోయే అనుభవంగా అభివర్ణించారు.

ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ప్రమోషనల్ ఈవెంట్‌గా కాకుండా, అమెజాన్ డెలివరీ అసోసియేట్లకు ప్రత్యేక గుర్తింపు, అనుభూతిని అందించేలా రూపొందించారు. తేజ సజ్జతో వారు మాట్లాడిన సందర్భాలు, ఫొటోలు దిగిన క్షణాలు, కార్యక్రమానికి సంబంధించిన తెరవెనుక విశేషాలను సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా షేర్ చేశారు. దీంతో ఈ ఫ్యాన్ ఎక్స్‌పీరియన్స్‌కు మంచి స్పందన లభించడంతో పాటు ‘ది ట్రైటర్స్ తెలుగు’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా డెలివరీ అసోసియేట్ శ్రీ కుంటల శివ తన అనుభవాన్ని పంచుకున్నారు. తేజ సజ్జను స్వయంగా కలిసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా అనిపించిందని చెప్పారు. ఆయనతో నేరుగా మాట్లాడటం తనకు ప్రత్యేకమైన అనుభవంగా నిలిచిందని, ‘ది ట్రైటర్స్ తెలుగు’ ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమంలో భాగం కావడం వల్ల ఈ జ్ఞాపకం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపారు.

మరో డెలివరీ అసోసియేట్ శ్రీ దినేష్ యాదవ్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తేజ సజ్జను స్వయంగా కలవడం తనకు నిజంగా ప్రత్యేకమైన క్షణమని అన్నారు. ఆయన సినిమాలు తాను చూసినప్పటికీ, ఇలా ప్రత్యక్షంగా కలిసే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. తేజతో మాట్లాడటం, ఫొటో దిగడం, ఈ కార్యక్రమంలో భాగం కావడం తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపారు.

ఇక ‘ది ట్రైటర్స్ తెలుగు’ విషయానికి వస్తే.. ‘ది ట్రైటర్స్’ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందిన రియాలిటీ ఫ్రాంచైజీ. ఇప్పటికే హిందీ వెర్షన్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ షోను రూపొందించారు. తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు కూడా తాజాగా వెల్లడయ్యాయి. అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో ‘ది ట్రైటర్స్ తెలుగు’ స్ట్రీమింగ్ కానుంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports