Telangana Assembly Tension: తాతా మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. BRS నేతల అరెస్టుతో హీటెక్కిన స్టేట్ పాలిటిక్స్ | తెలంగాణ వార్తలు | ACTPnews

Telangana Assembly Tension


Last Updated:

Telangana Assembly Tension: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రాజుకున్న హీట్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతల అరెస్టులు, ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతల డిమాండ్లపై రెండో రోజూ కూడా ఈ పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది.

Telangana Assembly Tension
Telangana Assembly Tension

Telangana Assembly Tension: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రాజుకున్న హీట్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతల అరెస్టులు, ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతల డిమాండ్లపై రెండో రోజూ కూడా ఈ పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. స్పీకర్ హోదాను కించపరిచేలా .. అత్యంత నీచమైన పదజాలంతో కామెంట్స్ చేసిన తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుతో వ్యవహారం ముదురుతోంది. మంగళవారం ఉదయం తాతా మధుని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి భారీగా పోలీసులు చేరుకున్నారు. సోమవారం స్పీకర్‌పై చేసిన కామెంట్స్‌పై నమోదైన కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేశారు. BNS 48 ప్రకారం అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ అరెస్టుతో ప్రస్తుతం తాతా మధు ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పాటు తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. తాతా మధుని అరెస్ట్ చేసిన పోలీసులు పీఎస్‌కు తరలించారు.  నిన్న స్పీకర్‌పై చేసిన కామెంట్స్ విషయంలో తాతా మధు స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు నారాయణగూడ పోలీసులు. మరికాసేపట్లో తాతా మధుని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed