Telangana Assembly: అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డికి భారీ షాక్ | తెలంగాణ వార్తలు | ACTPnews

brs


Last Updated:

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. స్పీకర్ బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు.

brs
brs

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని బీఆర్‌ఎస్ ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు ఆటంకంగా మారింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ సభ్యుల తీరు మార్చుకుని బిల్లుల చర్చకు సహకరించాలని తీవ్రంగా ఆగ్రహించారు. లేదంటే సస్పెన్షన్ ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా లెక్క చేయకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టూ ముట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన అక్కడి మార్షల్స్ బీఆర్‌ఎస్ సభ్యులను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దాదాపు అర్ధగంట ఇదే పరిస్థితి కొనసాగింది. బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఆగ్రహించారు. బీఆర్‌ఎస్ సభ్యులను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదనలు చేశారు. దీంతో బడ్జెట్‌పై చర్చకు అడ్డు పడుతున్నందన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేశారు. దీంతో కేటీఆర్, హరీశ్ రావుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సభను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కౌశిక్ రెడ్డి తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు: 

మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చకు చేర్చింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్‌ఎస్ నేతలు అంతా సమర్థిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి చేతితో సైగ చేస్తూ గన్‌తో కాలుస్తానని అన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అతని ప్రవర్తన అంతా వీడియో కెమెరాల్లో రికార్డు అయిందని చెప్పారు.

బీఆర్‌ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి తీరును సమర్థిస్తే మాత్రం అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని హెచ్చరించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తన తీరును సుమోటోగా విచారణకు స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు సభకు సహకరిస్తేనే సభలో ఉంచాలని, అడ్డుకునే శైలి ఉంటే మాత్రం తదుపరి సమావేశాల వరకూ వారిని సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed