దేశంలోని క్రియేటర్ ఎకానమీని రక్షించడంతో పాటు చలనచిత్ర పరిశ్రమ, బ్రాడ్కాస్టర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, నిర్మాతలు మరియు పంపిణీదారుల ప్రయోజనాలను ఆన్లైన్ పైరసీ నుండి కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. పలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, కంటెంట్ ఓనర్లు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన మంత్రిత్వ శాఖ.. అనధికారికంగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లను పంపిణీ చేస్తున్న 3,142 టెలిగ్రామ్ ఛానళ్లను గుర్తించింది.
ఐటీ చట్టం, 2000, ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం.. ప్రభుత్వ నోటీసు లేదా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాల్సిన బాధ్యత సదరు ప్లాట్‌ఫారమ్‌లపై ఉంటుంది.
ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ యాప్‌లలోని ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కూడా తన నిఘాను తీవ్రం చేసింది. ఇటీవల వాట్సాప్‌కు నోటీసులు పంపిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది.
ఈ యాప్‌లలో యూజర్‌నేమ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? సైబర్ నేరాలు, ఐడెంటిటీ థెఫ్ట్ (మరొకరి పేరుతో మోసాలు చేయడం) మరియు దీని దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్రం కోరింది.
సాధారణంగా వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ‘@’ సింబల్‌తో కూడిన యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల ఫోన్ నంబర్ షేర్ చేయకుండానే ఇతరులతో చాట్ చేయవచ్చు. అయితే, దీనివల్ల సైబర్ నేరగాళ్లకు మరింత వెసులుబాటు లభిస్తుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఆన్లైన్ మోసాల ముప్పు: ఈ ఫీచర్ వల్ల ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫిషింగ్, ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లు మరియు ఇతరుల పేర్లతో మెసేజ్‌లు పంపి మోసం చేసే అవకాశాలు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది.
నకిలీ గుర్తింపుల ముప్పు: నిజమైన వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, ఆర్థిక సంస్థలు లేదా ప్రభుత్వ ఏజెన్సీల పేర్లను పోలిన యూజర్‌నేమ్‌లను సృష్టించి, ప్రజలను సులభంగా బురిడీ కొట్టించే ప్రమాదం ఉందని నోటీసులో హెచ్చరించింది. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతారాహిత్యాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే టెలిగ్రామ్ పైరసీని అడ్డుకునేలా చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి. టెలిగ్రామ్‌ను యూజ్ చేసే వాళ్లలో చాలామంది పైరసీ, అశ్లీల కంటెంట్ కోసమే ఉపయోగిస్తుంటారు.












