Podarillu Serial Episode June 8th: ‘పొదరిల్లు’ జూన్ 8 ఎపిసోడ్‌లో తన వెనుక పడుతూ మాటిమాటికీ ఫోన్లు చేస్తోందని శైలజను కేశవ లాగిపెట్టి కొట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు కన్నాకు జ్వరం రావడంతో మహాలక్ష్మి నారాయణను అడిగి టాబ్లెట్స్ తెప్పిస్తుంది. రాత్రి చక్రి ఉద్యోగం నుండి ఆలస్యంగా ఇంటికి రావడంతో మహాలక్ష్మి తిండి తినకుండా అతని కోసం ఆరాటంగా ఎదురుచూస్తుంది; కానీ ఉదయం చక్రి ఆ విషయం అడగ్గా కేవలం ఇంట్లో వాళ్ల కోసమే వెయిట్ చేశానని మహా అబద్ధం చెప్పడంతో చక్రి హర్ట్ అవుతాడు. అది గమనించిన మహా అతనికి సారీ చెప్తుంది. చివరిగా, మహాలక్ష్మి కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లగా, దారిలో తను గుద్దేసుకున్న వ్యక్తిే ఆ కంపెనీ బాస్ అని తెలిసి ఉద్యోగం రాదని భయపడుతుంది; కానీ అతను మహాను ఉద్యోగానికి సెలెక్ట్ చేయడంతో ఆమె సంతోషపడటంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Illu Illalu Pillalu Serial Episode June 8th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ జూన్ 8 ఎపిసోడ్‌లో ప్రేమ తన ఇంట్లోకి అడుగుపెడితేనే ధీరజ్‌ను జైలు నుండి విడిపిస్తానని భద్రావతి కండిషన్ పెడుతుంది. దాంతో తీవ్రంగా బాధపడిన ప్రేమ, జైల్లో ఉన్న ధీరజ్ కోసం అర్ధరాత్రి ఎమోషనల్‌గా భోజనం తీసుకువెళ్లగా, వారిద్దరి మధ్య కన్నీళ్లు పెట్టించే సీన్ సాగుతుంది. మరోవైపు, ధీరజ్ లేని సమయంలో శ్రీవల్లి కడుపు నాటకంతో ఇంట్లో గంతులు వేస్తుండగా చందు అడ్డంగా చూస్తాడు; కానీ వల్లి వెంటనే ప్లేట్ ఫిరాయించి మరిది కోసం ఏడుస్తున్నట్లు డ్రామా ఆడి తప్పించుకుంటుంది. ఇక జైలు నుండి ధీరజ్ బయటకు రావడం కష్టమని చందు చెప్పడంతో, కక్షగట్టిన సేనే ఇదంతా చేశాడని గ్రహించిన రామరాజు ఆవేశంతో అతనిపై కత్తితో దాడి చేయబోగా తిరుపతి అడ్డుకుంటాడు. చివరిగా, తన వల్లే ధీరజ్ జైలుకు వెళ్లాడని భావించిన ప్రేమ ఇల్లు వదిలి పుట్టింటికి వచ్చేయడంతో భద్రావతి సంతోషపడగా, వెంటే వచ్చిన నర్మద షాక్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Nindu Manasulu Serial Episode June 8th: ‘నిండు మనసులు’ జూన్ 8 ఎపిసోడ్‌లో సాహితి ఫోన్ చేసి పిలవడంతో గణ విజయానంద్ ఇంటికి వస్తాడు; విజయానంద్, సిద్ధూలు అతడిని గెంటేయబోగా సాహితి అడ్డుపడి గణ తన భర్త అని, అతనిపై చేయి చేసుకునే అర్హత ఎవరికీ లేదని తెగేసి చెప్తుంది. సిద్ధూ తన పెళ్లితో పోల్చగా.. మీది ఆవేశపు పెళ్లి, నాది ఆలోచించి చేసుకున్న పెళ్లి అంటూ సాహితి ఎదురుతిరిగి మాట్లాడటంతో విజయానంద్ ఆవేశంతో గణపై గన్ గురిపెట్టి కాలుస్తాడు (కానీ బుల్లెట్ సాహితికి తగలదు). మరోవైపు రాజశేఖరం గణ చేసిన పనికి సిగ్గుపడుతుండగా, సిద్ధూ త్వరలోనే మీ కీళ్ళు విరిచేస్తాడని ఈశ్వరి హెచ్చరిస్తుంది. చివరిగా, కన్న పిల్లలిద్దరూ తనకు వెన్నుపోటు పొడిచారని మంజుల కన్నీళ్లు పెట్టుకోగా, తల్లిని ఓదార్చిన సిద్ధూ.. సాహితి చేసిన తప్పుకు ఆమెను క్షమించి ఇంట్లోనే ఉంచమని, త్వరలోనే అసలు నిజం కనుక్కుంటానని చెప్పడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Episode June 8th: ‘గుండెనిండా గుడిగంటలు’ జూన్ 8 ఎపిసోడ్‌లో బాలు తన ఫోటోలను బామ్మ వాళ్లకు పంపగా, వారి మనవడు రెండు రోజుల తర్వాత చూపిస్తానని చెప్పడంతో బాలు ఎదురుచూడాల్సి వస్తుంది. మరోవైపు అర్ధరాత్రి మీనా దెయ్యంలా వచ్చి బాలు ఫోన్ దొంగిలించి శివ వీడియో లీక్ చేశావు కదా అని తన గొంతు పట్టుకున్నట్లు రోహిణికి భయంకరమైన కల వస్తుంది. కలలో నన్ను చంపొద్దు అంటూ రోహిణి గట్టిగా తన్నడంతో మనోజ్ కింద పడిపోగా, ప్రభావతి వచ్చి నిజంగానే దెయ్యం పట్టిందేమోనని విభూది పెడుతుంది. ఇక ఉదయాన్నే రోహిణి వింత ప్రవర్తన చూసి మనోజ్, ప్రభావతిలు ఆమెను కామాక్షి ఇంటికి తీసుకెళ్లగా, అక్కడికి ఒక స్వామీజీ వస్తాడు. వాళ్లకు షాక్ ఇవ్వాలని రోహిణి నిజంగానే దెయ్యం పట్టినట్లు నటించగా, ఆ స్వామీజీ మాత్రం దెయ్యం వదిలిస్తానంటూ కర్రతో రోహిణిని దారుణంగా కొట్టడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Karthika Deepam 2 Serial Episode June 8th: ‘కార్తీక దీపం 2’ జూన్ 8 ఎపిసోడ్‌లో సూరజ్ జ్యోత్స్నకు ఫోన్ చేసి, రేపటి నుండి ఆమెకు నిద్ర లేకుండా చేస్తానని గట్టిగా హెచ్చరిస్తాడు. మరోవైపు దాగుడుమూతలు ఆడుతున్న శౌర్యకు శివన్నారాయణ రూమ్‌లో చిరిగిపోయిన దక్షిణామూర్తి ఫోటో దొరుకుతుంది; ఆమె దానిని అందరికీ చూపించి నిలదీయడంతో ఇంట్లో కలకలం రేగుతుంది. దాంతో జ్యోత్స్న దీపపై నిందలు వేయగా, శివన్నారాయణ అసలు కథను బయటపెడతాడు. గతంలో దక్షిణామూర్తి తన ఆశయాల కోసం కూతురి ప్రేమ పెళ్లిని వ్యతిరేకించాడని, గన్ తీసి దశరథ్‌ను చంపబోయాడని, ఆ రోజే కూతురు చనిపోయిందని నెత్తిన నీళ్లు పోసుకున్నాడని వివరిస్తాడు. ఇన్నాళ్లకు అతను మళ్లీ రావడం ఏదో ఒక అనర్థానికి దారితీస్తుందని శివన్నారాయణ భయపడతాడు. చివరిగా, ఆఫీసుకు వెళ్లిన కార్తీక్, దీపలు గంట ముందే వచ్చి పనిలో నిమగ్నమైన సూరజ్‌ను అప్రిషియేట్ చేయడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
Brahmamudi Serial Episode June 8th: ‘బ్రహ్మముడి’ జూన్ 8 ఎపిసోడ్‌లో ఇందుని కిడ్నాప్ చేసిన ఐశ్వర్య ఆమెను నోరుమూసుకుని ఉండమని బెదిరిస్తుండగా, సైకిలిస్ట్ నారాయణ చాటుగా అంతా గమనించి ఇందుని కాపాడాలని ఫిక్స్ అవుతాడు. బయట కాపలా ఉన్న రౌడీలను చితకబాదిన నారాయణ లోపలికి వెళ్లి ఇందు కట్లు విప్పడానికి ప్రయత్నించగా, ఐశ్వర్య అడ్డుపడటంతో ఇద్దరి మధ్య వెటకారాల గొడవ జరుగుతుంది. మరోవైపు ఆఫీసులో బోర్డు మీటింగ్ ప్రారంభమవ్వగా సీఈఓ పదవి కోసం రాజు, రేఖల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు నడుస్తాయి. బోర్డు మెంబర్లలో ఇద్దరు రేఖకు, మరో ఇద్దరు రాజుకు సమానంగా ఓట్లు వేయడంతో… గెలుపును డిసైడ్ చేసే చివరి ఓటు పరంధామయ్య చేతికి వస్తుంది. రాజుకు సపోర్ట్ చేయడం ఇష్టం లేక, ఇందు రాకపోవడంతో రేఖకు వేయాలో లేదో తేల్చుకోలేక పరంధామయ్య ఆలోచించుకోవడానికి కాస్త టైం అడగడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.












