Last Updated:
కర్ణాటక తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి డిమాండ్ చేయగా, చౌకబారు రాజకీయాలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారం తీవ్ర దుమారం రేగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ పట్టుబట్టారు. కర్ణాటక ప్రభుత్వం తమ హక్కుల కోసం పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చిందని, ఇక్కడ మన ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సీఎం విజయ్ బెంగళూరు వెళ్లాలనుకోవడం పట్ల ఉదయనిధి అభ్యంతరం వ్యక్తం చేశారు.














