The Red Bag: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ది రెడ్ బ్యాగ్.. హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో రాబోతున్న కొత్త సినిమా ది రెడ్ బ్యాగ్. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

News18
News18

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. రీసెంట్‌గా రాశీ పాత్రకు సంబంధించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా హీరోయిన్ రాధ్య పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆమెను చూపించిన తీరు, గన్ను పట్టుకున్న విధానం, చేతిలో ఉన్న ఆ వస్తువు ఇలా అన్నీ హైలెట్ అవుతున్నాయి. పవర్ ఫుల్ లుక్‌లో రాధ్య అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తొలి సినిమానే అయినా, నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ మోపురి సంగీతమందించగా.. ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే టీజర్‌తో మూవీపై మరింత బజ్ క్రియేట్ చేయనున్నారు.

ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, రాశి, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ మోపురి సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports