Tilak Varma: టాలీవుడ్ డాక్టర్‌తో లవ్‌లో పడ్డ తిలక్ వర్మ! ఇవిగో సాక్ష్యాలు అంటున్న ఫ్యాన్స్! | క్రీడా వార్తలు | ACTPnews

తిలక్ వర్మ


Last Updated:

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న డేటింగ్ రూమర్స్, తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY) చేసిన ఒక అల్లరి వ్యాఖ్యతో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

తిలక్ వర్మ
తిలక్ వర్మ

Tilak Varma: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, యంగ్ ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న డేటింగ్ రూమర్స్, తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY) చేసిన ఒక అల్లరి వ్యాఖ్యతో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఒక వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఆ వైరల్ క్లిప్‌లో.. తిలక్ వర్మ హెడ్‌ఫోన్స్ పెట్టుకుని చాలా సీరియస్‌గా హోటల్ లాబీలో నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి సూర్యకుమార్ యాదవ్ అతనిని ఉద్దేశించి “వీడు ప్రేమలో పడ్డాడు” (In Love) అంటూ గట్టిగా నవ్వుతూ ఆటపట్టించడం కనిపించింది. సూర్యకుమార్ నేరుగా శ్రీలీల పేరు ఎత్తకపోయినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఈ కామెంట్‌ను వీరిద్దరి మధ్య నడుస్తున్నట్లు చెప్తున్న ప్రేమ వ్యవహారానికి లింక్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ రూమర్లపై అటు తిలక్ వర్మ గానీ, ఇటు శ్రీలీల గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అసలు ఈ రూమర్స్ ఎలా మొదలయ్యాయి?

తిలక్ వర్మ, శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం ఈనాటిది కాదు. గత కొన్ని నెలలుగా వీరిపై గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీలీల తన తల్లి డాక్టర్ స్వర్ణలతతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అదే సమయంలో తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో కలిసి తిరుమలలోనే ఉండటంతో, ఇరు కుటుంబాలు కలిసి దర్శనం చేసుకున్నాయనే ప్రచారం మొదటిసారిగా తెరపైకి వచ్చింది.

ఆ తర్వాత ఐపీఎల్ (IPL) మ్యాచ్‌ల సందర్భంగా ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత ప్రీమియం హాస్పిటాలిటీ పవలియన్‌లో కూర్చుని మ్యాచ్ చూడటం అభిమానుల కంట పడింది. అంతేకాకుండా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌కు శ్రీలీల కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె పర్సనల్ టీమ్‌కు చెందిన ఒక వ్యక్తి వెనుక వైపు ‘తిలక్’ అని రాసి ఉన్న జెర్సీని ధరించి ఉండటాన్ని నెటిజన్లు గమనించారు. దాంతో, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే చర్చ సోషల్ మీడియాలో మరింత గట్టిగా వినిపించింది. ఇద్దరూ కొద్దిరోజుల పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని, మీడియా దృష్టి మరల్చడానికే ఇలా చేశారంటూ మరికొందరు చెప్తున్నారు.

తిలక్ వర్మకు మద్దతుగా నిలిచిన రెడ్డిట్ వినియోగదారులు

ఈ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో, చాలా మంది నెటిజన్లు మరియు రెడ్డిట్ (Reddit) యూజర్లు ఈ రూమర్లను కొట్టిపారేస్తున్నారు. కేవలం మ్యాచ్‌లు చూడటానికి వచ్చినంత మాత్రాన లేదా కొన్ని కాకతాళీయ సంఘటనలను బట్టి అఫైర్స్ అంటగట్టడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.

ఒక నెటిజన్ స్పందిస్తూ.. “వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఆ లాజిక్ ప్రకారం చూస్తే, గతంలో నటి ప్రతిభా రాంటా కూడా ముంబై మ్యాచ్‌కు వచ్చింది, అలాగని ఆమె శ్రేయస్ అయ్యర్‌ను డేటింగ్ చేస్తోందా? ఎవరైనా మ్యాచ్ చూడటానికి రావొచ్చు” అని రాశారు. మరో యూజర్ స్పందిస్తూ.. “శ్రుతి హాసన్ ఎన్నోసార్లు సీఎస్‌కే జెర్సీ వేసుకుని చెన్నై మ్యాచ్‌లకు వచ్చింది, అంతమాత్రాన ఆమె ఎవరినైనా ప్రేమిస్తున్నట్లా? సెలబ్రిటీలకు క్రికెట్ అంటే ఇష్టం, అంతే తప్ప ప్రతిదానికీ ప్రేమను అంటగట్టకండి” అంటూ తిలక్, శ్రీలీలలకు మద్దతుగా నిలిచారు.

కెరీర్ పరంగా ఇద్దరూ బిజీ బిజీ…

వ్యక్తిగత జీవితంపై ఎన్ని గాసిప్స్ వస్తున్నా, ఈ ఇద్దరు యువ తారలు తమ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన ఒక రొమాంటిక్ డ్రామాలో నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. మరోవైపు 23 ఏళ్ల హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ క్రికెట్ కెరీర్ కూడా అద్భుతంగా సాగుతోంది. ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడిగా మారిన తిలక్, ఇటీవల శ్రీలంకలో జరగబోయే వన్డే ట్రై-సిరీస్ కోసం ఇండియా-ఎ (India-A) జట్టుకు కెప్టెన్‌గా కూడా ఎంపికై బాధ్యతలు చేపట్టబోతున్నాడు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *