Tirumala: టీవీకే విజయాన్ని కాంక్షిస్తూ శ్రీవారికి మొక్కులు.. విజయ్ అభిమానులు ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో చూడండి | ట్రెండింగ్ | ACTPnews

Tirumala


Last Updated:

Tirumala: తమిళనాడులోని విజయ్ విజయాన్ని కాంక్షించిన తమిళ అభిమానులు మొక్కులు తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రమైన తిరుమలకు వచ్చి శ్రీవారి చెంతన మొక్కులు తీర్చుకున్నారు.

+

Tirumala temple

Tirumala: నిన్నటి వరకు అతను ఓ స్టార్ హీరో మాత్రమే. కాని ఇప్పుడు సక్సెస్‌ఫుల్ పొలిటిషియన్. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నటుడి గురించే చర్చ. తమిళనాట టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నటుడు విజయ్ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా టీవీకేని మార్చారు. ఇక రేపూ, మాపో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు. ఈసందర్భంగా తమిళనాడులోని ఆయన విజయాన్ని కాంక్షించిన తమిళ అభిమానులు ముక్కులు తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రమైన తిరుమలకు వచ్చి శ్రీవారి చెంతన మొక్కులు తీర్చుకున్నారు. విజయ్ వందకుపైగా సీట్లు గెలుచుకోవడంతో సుమారు 116 కొబ్బరికాయలు కొట్టారు. TVK పార్టీకి శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని తమిళ భక్తులు తెలిపారు. పార్టీ మరింత ప్రజలకు సేవ చేయాలని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

తిరుమలలో విజయ్ భక్తులు..

ఇప్పుడు విజయ్ మేనియా నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ థలపతి రాజకీయంగా సక్సెస్ కావడం.. ఆపార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుండటంతో అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలకు వచ్చారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో TVK పార్టీ ఘన విజయం సాధించడంతో, ఆ పార్టీ విజయం కోసం ముందుగానే శ్రీవారిని ప్రార్థించినట్లు భక్తులు తెలిపారు. తమ కోరిక నెరవేరడంతో తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా స్వామివారికి 116 కొబ్బరికాయలు కొట్టారు.

వెంకన్నకు మొక్కలు తీర్చుకున్న టీవీకే కార్యకర్తలు..

విజయ్ సాధించిన విజయం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తమిళనాడు నుండి తిరుపతికి వచ్చిన భక్తులు పేర్కొన్నారు. భక్తి, రాజకీయ ఆశయం కలిసి ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించాయని, శ్రీవారి కృప లేకుండా ఇది సాధ్యం కాలేదని వారు ప్రగాఢ విశ్వాసంతో చెప్పారు. అంతే కాదు 100కు పైగా స్థానాలు సాధించి విజయం అందుకున్న TVK పార్టీకి శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని తమిళ భక్తులు తెలిపారు. పార్టీ మరింత ప్రజలకు సేవ చేయాలని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

116 కొబ్బరికాయలు కొట్టిన భక్తులు..

స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన తమిళ భక్తులతో కొండపై కాస్త కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా వారు గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో భక్తుల ఆనందం, వారి విశ్వాసం మరింత స్పష్టంగా ప్రతిఫలించిన ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed