Last Updated:
ఘాట్ రోడ్డులో పోయిన బ్యాగ్ ను బైకర్ టీటీడీ సిబ్బందికి అప్పగించాడు. టీటీడీ అధికారులు బ్యాగ్ ను భక్తులకు తిరిగి ఇచ్చారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న ఆ కుటుంబానికి కొండపైకి చేరుకునేలోపే గుండెల్లో గుబులు పుట్టింది. విలువైన బంగారు ఆభరణాలు, లక్షల్లో విలువైన భూమి ఒప్పంద పత్రాలు, నగదు ఉన్న బ్యాగ్ ఘాట్ రోడ్డులోనే మిస్ కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే కొద్దిసేపటికే వారికి ఊహించని శుభవార్త అందింది. బ్యాగ్ ఓ నిజాయితీపరుడైన బైకర్ చేతికి చిక్కడంతో పాటు టీటీడీ భద్రతా సిబ్బంది దానిని పూర్తి భద్రతతో భక్తులకు తిరిగి అందించారు.














