Tirumala Journey: తిరుమల శ్రీవారి దర్శనానికి బస్‌లో వెళ్తున్నారా? మీకో అదిరిపోయే శుభవార్త! | బిజినెస్ | ACTPnews

Tirumala Journey: తిరుమల శ్రీవారి దర్శనానికి బస్‌లో వెళ్తున్నారా? మీకో అదిరిపోయే శుభవార్త!


Last Updated:

మీరు కూడా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటే.. ఈ విషయం వెంటనే తెలుసుకోండి.

Tirumala Journey: తిరుమల శ్రీవారి దర్శనానికి బస్‌లో వెళ్తున్నారా? మీకో అదిరిపోయే శుభవార్త!
Tirumala Journey: తిరుమల శ్రీవారి దర్శనానికి బస్‌లో వెళ్తున్నారా? మీకో అదిరిపోయే శుభవార్త!

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ, ఆర్థికంగా కలిసొచ్చేలా ప్రముఖ ఆన్‌లైన్ బస్సు టికెటింగ్ సంస్థ రెడ్‌బస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి తిరుపతికి బస్సులో వెళ్లే ప్రయాణికులు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. జూన్ 30, 2026 వరకు రెడ్‌బస్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారు ‘PILGRIM’ అనే ప్రోమో కోడ్ వాడితే ఏకంగా రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ అద్భుతమైన ఆఫర్ సర్వత్రా ఆకర్షిస్తోంది.

ఇటీవల తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి నగరాల మధ్య ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా జ్యేష్ఠాభిషేకం లాంటి విశేష ఉత్సవాలు, వారాంతపు సెలవులకు తోడు వేసవి రద్దీ వల్ల బస్సు బుకింగ్స్ అనూహ్యంగా ఊపందుకున్నాయి. గతేడాదితో పోల్చి చూస్తే 2026 జూన్ 14 నుంచి 20 మధ్య కాలంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి బస్సు బుకింగ్స్ ఏకంగా 22 శాతం మేర పెరుగుతాయని ఒక స్పష్టమైన అంచనా. దేశంలోనే అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రం తిరుపతికి వెళ్లే యాత్రికుల సంఖ్య రోజురోజుకూ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది కేవలం జనవరి నుంచి మే నెలల మధ్యే తిరుమలలో భక్తులకు 44 మిలియన్లకు పైగా భోజన, పానీయాలు అందించారంటే అక్కడ భక్తజన సందోహం ఏ స్థాయిలో ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Fridge: ఫ్రిజ్‌లో సాక్సులు పెడితే ఏం జరుగుతుంది? రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే జరిగే అద్భుతం చూసి షాక్ అవుతారు!

సుదూర తీర్థయాత్రలు, రాత్రి వేళ సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు జనం అత్యధికంగా సౌకర్యానికే పెద్దపీట వేస్తున్నారు. తాజా బుకింగ్స్ ఆధారంగా ప్రయాణికుల ప్రాధాన్యతలను పరిశీలిస్తే 65 శాతం మంది ప్రయాణికులు ఏసీ బస్సులకే ఓటు వేశారు. వేసవి తాపం నుంచి తప్పించుకుంటూ, ఎండల బారిన పడకుండా ప్రశాంతంగా గమ్యం చేరుకునేందుకు ఏసీ బస్సులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. బస్సుల రకాలను చూస్తే 58 శాతం మంది నిద్రపోయేందుకు వీలుగా ఉండే స్లీపర్ బస్సులను బుక్ చేసుకోగా, కేవలం 42 శాతం మంది మాత్రమే సీటర్ బస్సులకు ప్రాధాన్యం ఇచ్చారు. రాత్రిపూట ప్రయాణించే వారు నిద్రపోతూ హాయిగా వెళ్లేందుకు స్లీపర్ బస్సుల వైపే మొగ్గుచూపుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Acid Bugs: చూడటానికి చీమలా ఉంటుంది.. చర్మంపై వాలితే యాసిడ్ పోసినట్లే, ఏపీలోని ఆ జిల్లాలో కలకలం!

ప్రస్తుత రద్దీ ఆధారంగా ప్రాంతీయ ప్రయాణాల్లో హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-తిరుపతి, విశాఖపట్నం-హైదరాబాద్, హైదరాబాద్-నెల్లూరు మార్గాల్లో రాకపోకలు అత్యధికంగా సాగుతున్నాయి. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు వస్తే హైదరాబాద్-బెంగళూరు, తిరుపతి-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పూణే మార్గాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రధానంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మియాపూర్, లక్డికాపూల్, అమీర్‌పేట్ ప్రాంతాల నుంచి ప్రయాణికులు అధికంగా బస్సులు ఎక్కుతున్నట్లు రెడ్‌బస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ నగరంలో అత్యంత రద్దీ ఉండే బోర్డింగ్ పాయింట్లుగా నిలిచాయి.

ఈ ఆధ్యాత్మిక, వారాంతపు విహార యాత్రల్లో యువతే అత్యధికంగా ప్రయాణాలు చేస్తుండటం విశేషం. మొత్తం ప్రయాణికుల్లో 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతీయువకులే అత్యధికంగా 47 శాతం ఉన్నారు. ప్రయాణికుల్లో పురుషులు 64 శాతం కాగా, మహిళలు 36 శాతం ఉన్నారు. మొత్తం ఆన్‌లైన్ బుకింగ్స్‌లో టైర్-1 నగరాల వాటా 42 శాతం, టైర్-2 నగరాల వాటా 21 శాతం, టైర్-3 పట్టణాలు, గ్రామాల వాటా 37 శాతంగా నమోదైంది. మెట్రో నగరాలతో సమానంగా చిన్న పట్టణాల ప్రజలు సైతం డిజిటల్ సేవలు వినియోగించుకుంటూ తమ ప్రయాణాలను అత్యంత సురక్షితంగా ప్లాన్ చేసుకుంటున్నారని రెడ్‌బస్ వెల్లడించిన ఈ తాజా డేటా నిరూపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports