Last Updated:
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు ఎస్.ఎస్.రవిచంద్ర (84) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారని తెలిసింది.
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు ఎస్.ఎస్.రవిచంద్ర (84) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారని తెలిసింది. అప్పట్లోనే సీనియర్ దర్శకులు కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె.రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్‌గా పని చేసిన రవిచంద్ర జితేంద్ర నటించిన హిందీ ‘ఖైదీ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఆపై కృష్ణ హీరోగా ‘రౌడీ నంబర్ వన్’, ‘కిరాయిగూండా’, ‘సార్వభౌముడు’, ‘దొరగారికి దొంగపెళ్లాం’ లాంటి సినిమాలు చేశారు. అదేవిధంగా బాలకృష్ణ హీరోగా ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’, వెంకటేశ్ హీరోగా ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.రవిచంద్రకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేడు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని రవిచంద్ర సోదరుడు, నటుడు సారిక రామచంద్రరావు చెప్పారు.














