Last Updated:
టాలీవుడ్లో ఇప్పుడు విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘వేగ లీల’ కూడా చేరింది. ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
టాలీవుడ్లో ఇప్పుడు విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘వేగ లీల’ కూడా చేరింది. ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ‘వేగ లీల’ టీజర్లో ఆన్లైన్ చాటింగ్, బ్లైండ్ డేటింగ్‌కు సంబంధించిన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇదొక లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని తొలుత అనిపిస్తుంది. అయితే టీజర్లో చూపించిన కొన్ని సన్నివేశాలు చూస్తే.. అసలు కథలో ఊహించని మరో కోణం ఉన్నట్లు అర్థమవుతోంది.














