Tollywood: మరో డిఫరెంట్ యాంగిల్ స్టోరీతో రెడీ అవుతున్న ‘ది రెడ్ బ్యాగ్’ దర్శకుడు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ది రెడ్ బ్యాగ్ సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన రవి కుమార్ సీరపు.. ప్రస్తుతం మరో డిఫరెంట్ యాంగిల్ స్టోరీతో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నారట.

News18
News18

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన విభిన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ ఆగస్ట్ 21న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకుంది. దర్శకుడు రవి కుమార్ సీరపు తెరకెక్కించిన ఈ చిత్రం కథ, మేకింగ్, ట్రీట్‌మెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తొలి చిత్రంతోనే దర్శకుడిగా తనదైన శైలిని పరిచయం చేసిన రవి కుమార్ సీరపు, కథను చెప్పే విధానంలోనూ, తెరపై ఆవిష్కరించే విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సస్పెన్స్, ఎమోషన్, మెసేజ్‌ను సమతూకంగా మేళవిస్తూ సినిమాను నడిపించిన తీరు ఆయనలోని దర్శకుడి విజన్‌ను స్పష్టంగా చూపించింది.

ముఖ్యంగా ‘ది రెడ్ బ్యాగ్’ స్టైలిష్ మేకింగ్, విజువల్ ట్రీట్‌మెంట్, సన్నివేశాల రూపకల్పన ప్రేక్షకులు, సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. కేవలం కథను తెరకెక్కించడం కాకుండా, ప్రతి సన్నివేశానికి ఒక ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్ ఇవ్వడం ద్వారా రవి కుమార్ సీరపు తన దర్శకత్వ ముద్రను బలంగా వేసుకున్నారు.

కంటెంట్‌తో పాటు కమర్షియల్ అప్పీల్‌ను దృష్టిలో పెట్టుకుని కథను చెప్పగలిగే దర్శకుడిగా ‘ది రెడ్ బ్యాగ్’ ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ముఖ్యంగా కొత్త దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే తన విజన్‌పై నమ్మకంతో సినిమాను తెరకెక్కించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ‘ది రెడ్ బ్యాగ్’తో వచ్చిన ఈ గుర్తింపు రవి కుమార్ సీరపు దర్శకత్వ ప్రయాణానికి ఒక బలమైన ప్రారంభంగా నిలిచింది. తొలి చిత్రంతోనే తనకంటూ ఒక స్టైల్‌ను చూపించిన ఆయనపై ఇప్పుడు తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ‘ది రెడ్ బ్యాగ్’ విజయంతో ఉత్సాహంగా ఉన్న రవి కుమార్ సీరపు, మరింత విభిన్నమైన కథ, మరింత పెద్ద కాన్వాస్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ను రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి అడుగుతోనే తన సత్తాను చాటిన ఈ యువ దర్శకుడి తదుపరి ప్రయాణం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports