ఈ వినూత్న కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 20 లక్షల జంతువులకు వెటర్నరీ చికిత్స, రెస్క్యూ సేవలు, ఆశ్రయం, పౌష్టికాహారం మరియు దీర్ఘకాలిక సంరక్షణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వీధుల్లో తిరిగే కుక్కలు, పిల్లులు, గాయపడిన పశువులు, గుర్రాలు, గాడిదలు వంటి పెద్ద జంతువులకు సేవలు అందించేలా ఇది రూపుదిద్దుకుంది. ఇందులో యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) ద్వారా వాటి జనాభా నియంత్రణ కూడా భాగం. భారత జంతు సంక్షేమ బోర్డు (AWBI)కి చెందిన 8 మంది సభ్యులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.. “పరిమిత వనరులున్నా, ఎలాంటి గుర్తింపు ఆశించకుండా అపారమైన కరుణతో మూగజీవాలకు నిస్వార్థ సేవలందిస్తున్న వేలాది మంది నిజమైన యోధులు మన దేశంలో ఉన్నారు. వారి సేవలు మనకు గుర్తుచేసేది ఒక్కటే—దయకు హద్దులు లేవు, ప్రతి ప్రాణానికి సంరక్షణ, రక్షణ మరియు గౌరవం పొందే హక్కు ఉంది. ‘ఛాంపియన్స్ ఆఫ్ కేర్’ ద్వారా మేము వారికి వెన్నుదన్నుగా నిలబడి, కమ్యూనిటీ జంతువులకు మెరుగైన సంరక్షణ అందించేలా, మరింత దయాగుణంగల భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నాము. మా దృష్టిలో ‘ప్రతి ప్రాణం విలువైందే’ (Every Life Matters) అంటే ఇదే” అని ఆయన పేర్కొన్నారు.
AWBI మాజీ చైర్మన్ ఎస్.పి. గుప్తా మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో సైతం అరుదైన అత్యాధునిక జంతు వైద్య వసతులను అనంత్ అంబానీ జామ్‌నగర్‌లో ఏర్పాటు చేశారని, క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించే ఆయన ఆలోచనా దృక్పథం అద్భుతమని కొనియాడారు.
వంతారలో రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రతినిధుల సదస్సులో మొదటి రోజు.. సహాయం పొందిన ఏనుగులు, పులులు, సింహాలు, చిరుతలు వంటి వన్యప్రాణులకు అక్కడ కల్పిస్తున్న అద్భుతమైన వైద్యం, వసతులను సంస్థల ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించారు. రెండో రోజు క్షేత్రస్థాయి సవాళ్లు, పరిష్కారాలపై విస్తృత చర్చలు జరిగాయి.
అనంతరం వంతార మరియు 50కి పైగా జంతు సంక్షేమ సంస్థల మధ్య పరస్పర సహకారం కోసం కీలక ఒప్పందం (Letter of Understanding) కుదిరింది. సంస్థల సేవలను గుర్తిస్తూ అనంత్ అంబానీ స్వయంగా సంతకం చేసిన ప్రశంసా పత్రాలను (Certificates of Appreciation) వారికి అందజేశారు.
ఈ ప్రాజెక్ట్ కింద జంతు సంరక్షణ సంస్థలకు కేవలం తాత్కాలిక సాయమే కాకుండా శాశ్వత మౌలిక వసతులను సమకూర్చనున్నారు:
పశువైద్య ఆసుపత్రులు, రెస్క్యూ అంబులెన్సులు, మొబైల్ యూనిట్లు.
వ్యాధి నిర్ధారణ, చికిత్సా పరికరాలు, రెస్క్యూ సాధనాలు.
విద్యుత్ ఖర్చులు తగ్గించేలా సోలార్ పవర్ ప్లాంట్లు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు (Rainwater Harvesting), డ్రైనేజీ నిర్మాణాలు.
యువత, పిల్లల్లో జంతువుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు, అంటువ్యాధుల నియంత్రణకు క్వారంటైన్ వసతులు. వంతార సిద్ధాంతమైన “ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్” (Every Life Matters) సంకల్పాన్ని నాలుగు గోడలకే పరిమితం చేయకుండా దేశవ్యాప్త వీధి జంతువులకు కూడా విస్తరిస్తూ ‘ఛాంపియన్స్ ఆఫ్ కేర్’ నెట్‌వర్క్‌ను భవిష్యత్తులో మరింత విస్తరించాలని నిర్ణయించారు.













