Last Updated:
Tollywood Director: తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ గ్లామర్ వార్ షురూ కాబోతోందా? స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీకి కౌంటర్‌గా స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి…
Tollywood Director: సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం, పార్టీలు పెట్టడం లేదా ఉన్న పార్టీల్లో చేరి పదవులు అనుభవించడం మనకు తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా ఫిలిం నగర్, కోలీవుడ్ వర్గాల నుండి వస్తున్న ఒక హాట్ టాపిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, హీరోగా ముద్ర వేసుకున్న రాఘవ లారెన్స్ ఏకంగా రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. అది కూడా తమిళనాడు పాలిటిక్స్‌లో స్టార్ హీరోయిన్ త్రిషకు గట్టి పోటీగా ఆయన నిలబడబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అసలు ఇదెక్కడి మాస్ ట్విస్ట్? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం!
తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయనకు సపోర్ట్‌గా లేదా అపోజిషన్‌గా సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా రాజకీయ తెరపైకి వస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్‌కు అత్యంత ఆప్తురాలైన స్టార్ హీరోయిన్ త్రిష త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందనే చర్చ నడుస్తోంది. అయితే ఆమెకు కౌంటర్ ఇచ్చేలా, చెన్నై రాజకీయాల్లో చక్రం తిప్పడానికి మన లారెన్స్ మాస్టర్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం.
తెలుగులో ‘మాస్’, ‘స్టైల్’, అలాగే సూపర్ హిట్ ‘కాంచన’ సిరీస్‌లతో డైరెక్టర్‌గా, హీరోగా లారెన్స్ భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. దానికి తోడు ఆయన చేసే సామాజిక సేవలు, చారిటీ పనుల వల్ల ప్రజల్లో ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఇదే ఇమేజ్‌తో ఆయన తమిళ పాలిటిక్స్‌లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ఒక ప్రముఖ పొలిటికల్ పార్టీ తరఫున లారెన్స్‌ను బరిలోకి దించబోతున్నట్లు టాక్. హీరోయిన్ త్రిష ఒకవేళ అధికారికంగా ఒక పార్టీ తరఫున ప్రచారంలోకి వస్తే.. ఆమె ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి, సినీ గ్లామర్‌కు సినీ గ్లామర్‌తోనే సమాధానం చెప్పడానికి లారెన్స్ మాస్టర్‌ను అస్త్రంగా వాడుకోబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి ఒకే ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తూ ఇలా పాలిటిక్స్ లోకి వచ్చి ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడటం అనేది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అనే చెప్పాలి. స్క్రీన్ మీద లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీని, డైరెక్షన్‌ను చూసిన ఆడియన్స్.. ఇప్పుడు పాలిటిక్స్ లో వీళ్ల మధ్య వచ్చే పొలిటికల్ వార్ ను చూడబోతున్నారన్నమాట.
ప్రస్తుతానికైతే ఈ ‘రాఘవ లారెన్స్ వర్సెస్ త్రిష’ పొలిటికల్ వార్ కేవలం ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ గానే నడుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సదరు డైరెక్టర్ లేదా త్రిష అఫీషియల్‌గా స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఈ కాంబినేషన్ వినడానికే ఇదెక్కడి మాస్‌రా మామ అనుకునేలా ఉంది కదా!
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 08, 2026 12:05 PM IST













