Top 10 News: భారీగా తగ్గిన బంగారం.. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు.. నేటి టాప్ న్యూస్ మీకోసం.. | | ACTPnews

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు


సాయికృష్ణ కుటుంబాన్ని కలిసిన చంద్రబాబు:

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబసభ్యులు సీఎం చంద్రబాబు కలిశారు. తన కుమారుడి అదృశ్యంపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజయలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సీఐని సస్పెండ్‌ చేసి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని.. కచ్చితంగా న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

మాజీ మంత్రికి మహిళా కమిషన్ నోటీసులు:

మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ వివరణ కోరింది. ఈనెల 24న విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్‌ ఆదేశించింది. స్పందించకుంటే వీడియో క్లిప్పింగ్స్‌, ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు కమిషన్‌.

ఆరుట్లలో నో అడ్మిషన్ బోర్డు:

విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్‌లో 8.5% నిధులు విద్యకు కేటాయించామన్నారు.

తల్లితండ్రుల కలలు సాకారం చేయడమే ప్రభుత్వం విధానమన్నారు. మొదటిసారి ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ విధానం అమలు చేశామన్నారు సీఎం. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు రాకపోయేవారని… ఇప్పుడు ఆరుట్లలో నో అడ్మిషన్ బోర్డుపెట్టారన్నారు సీఎం రేవంత్.

కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్:

హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ప్రజలు కాంగ్రెస్, బీజేపీని నమ్మ లేదన్నారు. కాంగ్రెస్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయిందన్నారు. ఫస్టాఫ్‌ పాలన అట్టర్‌ఫ్లాప్‌ అంటూ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పాలనను తిట్టుకోనివాళ్లు లేరన్నారు కేటీఆర్.

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు:

సంధ్య థియేటర్‌ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఏ11 నిందితుడిగా చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. సంధ్య థియేటర్‌ ఘటనలో ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి.

నీట్ రీఎగ్జామ్ పై సుప్రీంకోర్టు సంచలనం :

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో జూన్‌ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది. నీట్ పరీక్షను నిలిపివేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది.

ఇరాన్ అమెరికా చర్చలు వాయిదా:

అమెరికా-ఇరాన్‌ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. యుద్ధాన్ని ముగించే విషయంపై చర్చలు వాయిదా పడినట్లు స్విట్జర్లాండ్‌ ప్రకటించింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య పోరాటం ఉద్ధృతమైంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 16మంది మృతి చెందారు. దీంతో చర్చలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని ఇరాన్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్విట్జర్లాండ్‌కు వెళ్లాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

టెలిగ్రామ్ బ్యాన్ సరైందే:

నీట్‌-యూజీ (2026) రీఎగ్జామ్‌ నేపథ్యంలో మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కేంద్రం ఆంక్షలను సవాల్‌ చేస్తూ టెలిగ్రామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కేంద్రం చర్యలు సరైనవేనని కోర్టు స్పష్టం చేసింది.

శాట్ కామ్ రంగంలోకి జియో

టెలికాం సేవల విభాగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న జియో… ఇప్పుడు స్వదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా అంతరిక్షం నుంచి కనెక్టివిటీని అందించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు శాట్‌కామ్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కంపెనీ చూస్తోందని జియో ప్లాట్‌ఫామ్స్‌ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. ఈ విభాగంలో జియో కూడా అడుగుపెట్టబోతోంది.

భారీగా తగ్గిన బంగారం:

మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు పడిపోయాయి. ఈ ఎఫెక్ట్ లోహాలపై కూడా పడింది. దీంతో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,270గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.3000కు పైనే తగ్గింది. ఇక, కేజీ వెండి ధర రూ.2.37లక్షలు పలికింది. వెండి ధర ఒక్క రోజే రూ.8,600 తగ్గడం గమనార్హం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *