Last Updated:
ఆగస్టు 12న ఆకాశంలో అద్భుతం.. కానీ భారత్కు మాత్రం కనిపించదా? 2026లో జరగనున్న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం మనకూ కనిపిస్తుందా? తెలుసుకుందాం పదండి…
2026లో ఖగోళ ప్రియులను ఆకట్టుకోనున్న అరుదైన ఖగోళ ఘట్టాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి. 2026 ఆగస్టు 12, బుధవారం ఈ సూర్యగ్రహణం సంభవించనుంది. చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యగా ప్రయాణిస్తూ సూర్యుడి ప్రకాశవంతమైన ముఖాన్ని కొంతకాలం పూర్తిగా లేదా పాక్షికంగా కప్పివేయడం వల్ల ఈ అద్భుత దృశ్యం ఏర్పడుతుంది. సంపూర్ణ గ్రహణం కనిపించే ప్రాంతం మాత్రం భూమిపై చాలా పరిమితంగా ఉంటుంది. విస్తృత ప్రాంతాల్లో మాత్రం చంద్రుడు సూర్యుడిని కొంతమేర మాత్రమే కప్పే పాక్షిక గ్రహణం కనిపిస్తుంది.














