Last Updated:
రాకింగ్ స్టార్ యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్‌లో కియారా లుక్, నటన చూసిన ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ప్రశంసల వర్షం కురిపించారు.
భార్యపై సిద్ధార్థ్ ప్రశంసల వర్షం పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్‌లో యశ్ స్వాగ్‌తో పాటు కియారా అద్వానీ ఇంటెన్స్ లుక్స్, యాక్టింగ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ ట్రైలర్ చూసిన కియారా భర్త, బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.














