Last Updated:
బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయిన టాక్సిక్ సినిమా ఓటీటీ డీల్ పై కీలక సమాచారాలు వీర అవుతున్నాయి. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఓ లుక్కేద్దామా..
‘కేజీఎఫ్’ సిరీస్ అఖండ విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తాజా చిత్రం ‘టాక్సిక్’. జాతీయ అవార్డు గ్రహీత, లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమై బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు మూడేళ్లు సమయం తీసుకుని యశ్ చేసిన ఈ ప్రయోగం బెడిసికొట్టడంతో ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురయ్యాయి. సమాచారం ప్రకారం ఈ చిత్రం కారణంగా నిర్మాతలకు ఏకంగా రూ. 300 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తొలిరోజు ఓపెనింగ్స్ అదిరిపోయినా, కంటెంట్‌లో దమ్ములేకపోవడంతో ఆ తర్వాతి రోజుల నుంచే వసూళ్లు దారుణంగా పడిపోయాయి.














